- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తరుచు యూరిన్ వెళ్తున్నారా? అయితే డేంజరే..!
దిశ, ఫీచర్స్: బాత్రూమ్ హ్యాబిట్స్‌లో మార్పులు వివిధ అనారోగ్య సమస్యలకు సంకేతం. విరేచనాలు, మలంలో రక్తం, మలబద్ధకం వంటి ప్రేగు కదలికలలో మార్పులు కొన్ని సాధారణ లక్షణాలు. కాగా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్‌ను సూచించే మరో వార్నింగ్ సైట్ మూత్రవిసర్జన అలవాట్లలో మార్పులు. కాగా తరుచుగా యూరిన్ చేయడంతో ఉన్న అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది మూత్రపిండాలు, మూత్రాశయం లేదా మూత్రనాళంలో కలిగే ఇన్ఫెక్షన్. కాగా UTI తరుచుగా, బాధాకరమైన మూత్రవిసర్జనకు దారితీస్తుంది. యూరినేషన్ సమయంలో మంటను కూడా అనుభవించవచ్చు.
డయాబెటిస్
మధుమేహం అనేది శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. మీ సిస్టమ్ నుంచి అదనపు గ్లూకోజ్‌ను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు అధిక రక్తంలో చక్కెర స్థాయిలు మూత్రవిసర్జనను పెంచుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల మళ్లీ మళ్లీ దాహం వేయవచ్చు. తద్వారా నీరు త్రాగడం, మూత్ర విసర్జన చేయడం మొదలైన వాటికి దారితీయవచ్చు.
ఇంటర్‌స్టీషియల్ సిస్టిటిస్
ఇంటర్‌స్టీషియల్ సిస్టిటిస్ అనేది దీర్ఘకాలిక మూత్రాశయ ఆరోగ్య సమస్య. మూత్రాశయం ప్రాంతంలో నొప్పి, పీడనం వంటి అనుభూతిని కలిగి ఉంటుంది. ఈ పరిస్థితి తరుచుగా, బాధాకరమైన మూత్రవిసర్జనకు కారణమవుతుంది. మూత్రాశయం నిండినప్పుడు కడుపులో నొప్పిని కూడా అనుభవించవచ్చు. యూరిన్ చేసిన తర్వాత ఉపశమనం పొందవచ్చు.
ఓవర్ యాక్టివ్ బ్లాడర్
అకస్మాత్తుగా, అత్యవసరంగా మూత్ర విసర్జన చేయవలసి రావడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సంకేతం. ఇది తరచుగా లీకేజ్ లేదా ఆపుకోలేని యూరినేషన్‌కు కారణం అవుతుంది. మూత్రవిసర్జనపై స్వీయ నియంత్రణ లేకపోవడం వంటి ఇతర లక్షణాలతో ముడిపడి ఉంటుంది.
బ్లాడర్ క్యాన్సర్
మూత్రాశయం కణాల్లో బ్లాడర్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. అరుదైన సందర్భాల్లో తరచుగా మూత్రవిసర్జన మూత్రాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఆకస్మికంగా యూరిన్ చేయాలనే కోరిక, మూత్రం విసర్జించేటప్పుడు మంటగా ఉండటం ఇతర లక్షణాలుగా చెప్పవచ్చు.
యాంగ్జయిటీ లేదా స్ట్రెస్
శరీరంలో అధిక స్థాయి ఒత్తిడి, ఆందోళన మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది. తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది. మీ పొత్తికడుపులో కండరాలు బిగుతుగా ఉన్నప్పుడు యూరిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి వల్ల శరీరాన్ని ఏదైనా గాయం లేదా సంభావ్య ముప్పు నుంచి రక్షించడానికి కండరాలు బిగుతుగా మారతాయి.
ప్రొస్టేట్ ఇష్యూస్
పురుషులలో ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా విస్తరించిన ప్రోస్టేట్ తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి: