వాయిదాపడ్డ 'National Cinema Day '.. 'బ్రహ్మాస్త్ర' హస్తముందని టాక్

by sudharani |   ( Updated:2022-09-14 11:10:21.0  )
వాయిదాపడ్డ National Cinema Day .. బ్రహ్మాస్త్ర హస్తముందని టాక్
X

దిశ, సినిమా : రెండు వారాల కిందట సెప్టెంబర్ 16ను 'నేషనల్ సినిమా డే'గా ప్రకటించిన మల్టిప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(MAI).. ఆ రోజున మల్టిప్లెక్స్‌లో టికెట్ ధర రూ.75 మాత్రమే అని తెలిపింది. కానీ హఠాత్తుగా ఈ 'స్పెషల్ డే'ను ఈ నెల 23కు వాయిదా వేసింది. 'బ్రహ్మస్త్ర' మూవీ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాధారణంగా త్రీడీ మూవీ టికెట్‌ను రూ.75కు అందిస్తే.. జనాలు విపరీతంగా వస్తారు. కానీ 'బ్రహ్మాస్త్ర' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కనీసం పది రోజుల పాటు ఈ కలెక్షన్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ వర్గాల నమ్మకం. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ.200 నుంచి రూ.900 రూపాయల పైమాటే. ఈ నేపథ్యంలోనే 'బ్రహ్మాస్త్ర'పై ప్రభావం పడకుండా 'నేషనల్ సినిమా డే'ను 23వ తేదీకి మార్చారనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed