నీటిలో మైక్రో ప్లాస్టిక్ శుద్ధికి పౌడర్.. గంటలో మురుగునీరు క్లీన్..

by Hajipasha |   ( Updated:2022-11-30 13:55:44.0  )
నీటిలో మైక్రో ప్లాస్టిక్ శుద్ధికి పౌడర్.. గంటలో మురుగునీరు క్లీన్..
X

దిశ, ఫీచర్స్: మురుగునీటి శుద్ధీకరణ ఒకప్పుడు సాంప్రదాయ కాలుష్య కారకాలను రిమూవ్ చేయడంతో పూర్తయ్యేది కానీ, ఇప్పుడు ఇది మైక్రో ప్లాస్టిక్ కణాల తొలగింపుతో కూడా ముడిపడి ఉంది. కాగా ఒక కొత్త పౌడర్ ఈ పనిని గతంలో కంటే క్షుణ్ణంగా, వేగంగా చేస్తుంది. ఆస్ట్రేలియా RMIT యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఈ పౌడర్.. సాధారణమైన తెల్లని పొడి లాగా కనిపించినప్పటికీ.. వాస్తవానికి మైక్రోస్కోపిక్, ఫెర్రో మాగ్నెటిక్ 'నానోపిల్లర్డ్ స్ట్రక్చర్స్'తో రూపొందించబడింది.

ఈ స్ట్రక్చర్స్‌లో ప్రతి ఒక్కటి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (MOF) పదార్థం రెండు షీట్‌లను కలిగి ఉంటుంది. వాటి మధ్య అంతరంలో కార్బన్-ఎన్‌క్యాప్సులేటెడ్ ఐరన్ ఆక్సైడ్ నానోపిల్లర్‌ల శ్రేణి ఉంటుంది. ఈ అమరిక వలన పెద్ద మొత్తంలో ఉపరితల వైశాల్యం ఏర్పడుతుంది. దీని ద్వారా అతి చిన్న మైక్రో ప్లాస్టిక్ కణాలు కూడా అతుక్కుంటాయి. ఈ పొడిని మురుగు నీటిలో కలిపిన తర్వాత ఇందులో ఉండే మ్యాగ్నెట్.. మైక్రో ప్లాస్టిక్ కణాలతో పాటు అన్ని నానోపిల్లర్డ్ నిర్మాణాలను రిమూవ్ చేస్తుంది. కేవలం ఒక గంటలో కలుషిత నీటి నమూనాల నుంచి అన్ని కణాలను విజయవంతంగా తొలగించగలదు. ఈ నానోపిల్లర్డ్ స్ట్రక్చర్స్‌ను మరో ఆరు సార్లు ఉపయోగించే అవకాశం ఉండగా.. అదనపు ప్రయోజనంగా మిథిలిన్ బ్లూను కూడా శోషించాయి. ఇదిలా ఉంటే సాంప్రదాయిక శుద్ధీకరణ పద్ధతులు పూర్తి కావడానికి రోజులు పడుతుంది. ఆపై అంత సమగ్రంగా కూడా ఉండవు.

'మా పౌడర్ సంకలితం ప్రస్తుతం ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాల ద్వారా గుర్తించదగిన వాటి కంటే 1,000 రెట్లు చిన్న మైక్రోప్లాస్టిక్‌లను తొలగించగలదు' అని ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కీ ఎష్తియాగి తెలిపారు. ఈ ఆవిష్కరణను తదుపరి దశలకు తీసుకెళ్లేందుకు ఇండస్ట్రియల్ కొలాబోరేటర్స్ కోసం చూస్తున్నట్లు వివరించారు.

READ MORE

కోడి కూస్తుందని ఫిర్యాదు చేసిన డాక్టర్ మోడీ.. అసలు కారణం ఏమిటంటే?

Advertisement

Next Story

Most Viewed