Mother Milk - Breast Feed : తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడం బిడ్డకు హానికరమా? ఎందుకు?

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-04 10:25:18.0  )
Mother Milk - Breast Feed : తల్లి పాలు ఎక్కువగా ఇవ్వడం బిడ్డకు హానికరమా? ఎందుకు?
X

దిశ, ఫీచర్స్: పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఆ శిశువుతో సన్నిహిత బంధాన్ని ఏర్పరుచుకుంటుంది తల్లి. ఈ పద్ధతి ఒకరినొకరు పూర్తిగా తమ ప్రేమను అందించడానికి, ఆస్వాదించడానికి సహాయపడుతుందని చెప్తున్నారు నిపుణులు. కానీ అధికంగా చనుబాలు ఇవ్వడం వల్ల బంధం విషపూరిత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంటుంటారు పెద్దలు. బిడ్డ తల్లితోనే అతుక్కు పోయేలా చేస్తాయని చెప్తారు. మరి ఈ విషయం వాస్తవమేనా? ఎక్స్ పర్ట్స్ ఏం చెప్తున్నారు? తెలుసుకుందాం.

నిజానికి తల్లిపాలు బిడ్డను భావోద్వేగ బంధంతో కట్టిపడేస్తాయి. మదర్ ఫీడ్ ఇచ్చినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ప్రేమ, అనుబంధం, వెచ్చదనం భావాలను కలిగిస్తుంది. తల్లి, శిశువు ప్రశాంతంగా ఉండేందుకు, డీప్ గా కనెక్ట్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు శిశువులలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది బిడ్డకు మరింత భావోద్వేగ స్థిరత్వం, భద్రతను కలిగిస్తుంది. ప్రత్యేకమైన బంధాన్ని పటిష్టం చేస్తుంది.

బ్రెస్ట్ ఫీడ్ బిడ్డ తల్లికి అతుక్కుపోయేలా చేస్తుందని.. ఈ పద్ధతి విషపూరిత స్థాయికి చేరుస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. మదర్ మిల్క్ బ్యాలెన్స్డ్ పారాసింపథెటిక్-ఫీల్ కలిగిన నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఇది బిడ్డ భావోద్వేగ స్థిరత్వం, స్థితిస్థాపకతకు దోహదం చేస్తుంది. అంటే తల్లిపాలు శిశువుకు భద్రత, స్థిరత్వం భావాన్ని బలోపేతం చేయడంలో సహాయపడవచ్చు, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఫ్రీడం పెంపొందించడంలో హెల్ప్ అవుతాయి.

తల్లిపాలు అధికంగా ఇస్తే ఇతర కుటుంబ సభ్యులతో బంధం ఏర్పడదనే అపోహ కూడా ఉంది. కానీ బ్రెస్ట్ ఫీడ్ శిశువు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తుంది. తల్లితో పాటు ఇతరులు బేబీని ఎత్తుకోవడం, ఆడుకోవడం, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పరుస్తుందని చెప్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed