అమ్మే సర్వస్వం.. ప్రేమకు ప్రతిరూపం..

by Sumithra |   ( Updated:2024-05-11 15:10:09.0  )
అమ్మే సర్వస్వం.. ప్రేమకు ప్రతిరూపం..
X

అవని మీద దైవం అమ్మ, అందరికీ జన్మనిచ్చేది అమ్మ, అంగడిలో దొరకనిది అమ్మ ప్రేమ, అందరికీ ఆప్యాయత, అనురాగాన్ని పంచేది అమ్మ, ప్రతి బిడ్డకు తొలి గురువు అమ్మ, తాను తినకున్నా బిడ్డ ఆకలి తీర్చేది అమ్మ, బిడ్డలు తప్పటడుగులను సరిదిద్దేది అమ్మ, బిడ్డ బుడిబుడి అడుగులను చూసి మురిసేది అమ్మ.

దిశ, ఫీచర్స్ : దేవుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంట్లోనూ అమ్మను సృష్టించాడని చెబుతారు. అమ్మ..! ఈ రెండు అక్షరాల్లో అమృతం దాగి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో మహత్మ్యం ఉంది. మాటలకు అందనంత ప్రేమను అమ్మ చూపిస్తుంది. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపించేలా చేస్తుంది. కడుపులో బిడ్డను నవమాసాలు మోసి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, తన రక్తాన్ని పంచి బిడ్డకు జన్మనిచ్చి తాను పునర్జన్మనెత్తుంది. తన ఒడిలో చేరిన బిడ్డను చూసి భరించిన బాధనంతా మరిచిపోతుంది. చంటి బిడ్డకు జోలపాడుతూ బజ్జో పెడుతుంది. అమ్మ లాలి పాటకు మించిన సంగీతం మరోటి లేదు. అమృతం రుచి ఎలా ఉంటుందో అమ్మచేతి వంట అంతకు మించి ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు ప్రపంచంలో అమ్మ లేనివాడు, అమ్మ ప్రేమ దక్కని వాడు ఎంత ధనికుడైనా పేదవాడే. అమ్మ ప్రేమ దక్కినవాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు.

మన భారతదేశంలో మాతృదేవోభవ అంటూ తల్లికే అగ్రతాంబూలం ఇస్తున్నాం. ఏదేశంలో అయినా సంస్కృతీ సాంప్రదాయాలు మారాయి కానీ అమ్మ ప్రేమలో మాత్రం మార్పు రాదు. అందుకే బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రపంచంలో అమ్మను మించిన అపురూపం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదటగా తలుచుకునేది అమ్మ అనే. అమ్మ స్థానం అంత గొప్పది మరి. ప్రతి బిడ్డకు మంచి స్నేహితురాలు అమ్మ.

మనుషుల్లోనే కాదు పశువుల్లో కూడా తన బిడ్డకు బాధ కలిగిందనే విషయం ముందుగా తెలిసేది అమ్మకే. బిడ్డకు ఆకలివేస్తుందన్న విషయం కూడా తెలిసేది ముందుగా అమ్మకే. బిడ్డకు ఒంట్లో నలతగా ఉంటే తల్లి తల్లడిల్లిపోతుంది. కళ్లల్లో వత్తులేసుకుని కంటికి రెప్పలా కాచుకుంటుంది. బిడ్డ విజం సాధించినప్పుడు ఆనందంతో ఇప్పొంగిపోతుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Read More...

అమ్మకు ప్రేమతో.. ఈ స్టోరీలోని మ్యాజిక్ తెలియాలంటే.. చదవాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed