Misbehavior with a woman : మహిళకు కన్ను కొట్టిన వ్యక్తికి రూ.15 వేల ఫైన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

by Javid Pasha |
Misbehavior with a woman : మహిళకు కన్ను కొట్టిన వ్యక్తికి రూ.15 వేల ఫైన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
X

దిశ, ఫీచర్స్: ఓవైపు మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన వార్తలు ఇప్పటికే ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ.. కొందరి వక్రబుద్ది మారడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాన్స్ దొరికితే చాలు స్త్రీలపట్ల తమలోని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నవారు ఎక్కడో ఒక దగ్గర తారపడుతూనే ఉన్నారు. అలాంటి ఓ సంఘటనకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మహిళకు కన్నుకొట్టగా.. కోర్టు అతనికి ఫైన్ విధించింది. అసలు ఏం జరిగిందంటే..

మహిళల సేఫ్టీకోసం మన దేశంలో నిర్భయ చట్టం తెచ్చారు. అంతకు ముందు కూడా పలు చట్టాలు ఉన్నాయి. వీటి ప్రకారం.. పురుషులు స్త్రీలను అనుమానాస్పదంగా, అశ్లీల దృష్టితో చూడటం, చెడు ఉద్దేశంతో పేరు పెట్టి పిలవడం వంటివి నేర స్వభావం గల వ్యక్తి లక్షణాలుగా పరిగణించబడతాయి. అట్లనే ధరించిన దుస్తులు గురించి, వాటి కలర్ గురించి తప్పుగా మాట్లాడటం కూడా నేరమే. కానీ ఇవేవీ ఆచరణలో అమలు అవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా చట్టం సరిగ్గా అమలు చేస్తే నేరస్థుల ఆటకట్టించవచ్చు అని నిరూపించే కేసుకు సంబంధించిన వార్త ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

వైరలవుతోన్న సమాచారం ప్రకారం.. ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా ఆమెకు కన్ను కొట్టాడు. దీంతో ఆమె అతని చెంపచెళ్లుమనిపించింది. అంతేకాకుండా ధైర్యంగా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని హైకోర్టులో ప్రవేశ పెట్టగా.. విచారణ అనంతరం సదరు వ్యక్తిని దోషిగా తేల్చింది. మహిళపట్ల అమర్యాదగా, అగౌరవంగా, చెడు ఉద్దేశంతో ప్రవర్తించడంతోపాటు ఆమెకు కన్ను కొట్టినందుకు రూ.15000 జరిమానా విధించింది. ఇంకోసారి ఏ మహిళలపట్ల అయినా తప్పుగా ప్రవర్తిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. బాగా అయిందని, స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించే వారికి తగిన శిక్ష పడాల్సిందేనని, అప్పుడే మార్పు వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed