- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిరాకిల్ క్రీమ్.. బొల్లి వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తున్న రుక్సోలిటినిబ్
దిశ, ఫీచర్స్: శరీరంపై తెల్లటి మచ్చలకు కారణమయ్యే చర్మ సంబంధిత బొల్లి(Vitiligo) వ్యాధి ఇటీవలి కాలంలో కెనడియన్ మోడల్ విన్నీ హార్లో వంటి పబ్లిక్ ఫిగర్ల కారణంగా వరల్డ్ పాపులర్ అయింది. ఇది ప్రపంచ జనాభాలో 0.5-1 శాతం మందిలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. శరీరంలోని చర్మం రంగులకు కారణయ్యే వర్ణద్రవ్యాన్ని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా హెల్తీ అండ్ నాచురల్ స్కిన్‌కు దోహదపడే ఆటోఇమ్యూన్ పవర్ క్షీణించడం మూలంగా బొల్లి వ్యాధి బయట పడుతుంది. టెక్నికల్లీ ఈ వ్యాధికి ఇప్పటి వరకైతే చికిత్స లేదు. కానీ కొన్ని ట్రీట్ మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే బొల్లి వ్యాధిని నయం చేస్తాయంటూ ప్రపంచ బ్యాప్తంగా ఇటీవల మార్కెట్లోకి వస్తున్న పలు స్కిన్ క్రీములు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. నివారణలేని చర్మ సమస్యకు విరుగుడుగా అందుబాటులోకి వచ్చాయని పలువురు పేర్కొంటున్నారు.
రుక్సోలిటినిబ్.. క్రీమ్‌ను Opzelura బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఇది యూఎస్‌లో అందుబాటులో ఉంది. ఈ క్రీమ్ తాత్కాలికంగా కొంత వరకు స్కిన్ నేచురాలిటీని రీస్టోర్ చేస్తుంది. అంటే బొల్లి వ్యాధితో ఏర్పడిన తెల్లని మచ్చలను తొలగిస్తుంది. అయితే పెద్దగా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోవడంతో యూరోపియన్ రెగ్యులేటర్లు దీనిని అందుబాటులో ఉంచాలా వద్దా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ రుక్సోలిటినిబ్ (ruxolitinib) క్రీముకు సంబంధించిన వివాదం ఇప్పటికే అక్కడి కోర్టు పరిధిలో ఉంది.
బొల్లి వ్యాధి అంటే ఏమిటి?
శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడే ఒక రకమైన స్కిన్ కండిషన్. ఈ వ్యాధి సోకిన బాధితుల్లో అది శరీరంలో ఏ భాగంలోని చర్మాన్నయినా సరే పాచ్(మచ్చ) లాగా మారేలా చేస్తుంది. ఇది వెంట్రుకలు, కనుబొమ్మలతో సహా త్వరగా జుట్టు తెల్లబడటానికి కూడా కారణం అవుతుంది. ఇది స్త్రీ, పురుషులందరిలో కనిపిస్తున్నప్పటికీ ఎక్కువగా బ్రౌన్, బ్లాక్ కలర్ స్కిన్ కలిగిన వ్యక్తుల్లో బయటపడుతోంది. ఎందుకంటే పాచెస్ సాధారణంగా తెల్లగా ఉంటాయి కాబట్టి. ఈ రకమైన ఆటోఇమ్యూన్ కండిషన్ చర్మంలోని మెలనిన్ (melanin) కణాల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. మెలనిన్ అనే పదార్థమే మన శరీరంలోని కళ్లు, జుట్టు, చర్మం కలర్స్‌ను డిసైడ్ చేస్తుంది.
30 ఏళ్లలోపు వారిలో స్కిన్‌పై ఏర్పడే తెల్లటి మచ్చలే బొల్లి వ్యాధి ప్రధాన లక్షణం. అయితే ఇది బాధిత వ్యక్తి మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శరీరమంతా తెల్లటి మచ్చలు కలిగి ఉన్నవారు ఎండలో బయటకు వెళ్తే త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. బాధితుల్లో వినికిడి లోపం లేదా దృష్టి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
ట్రీట్మెంట్ ఉందా?
సాధారణంగా బొల్లి వ్యాధితో చర్మ ఆరోగ్యానికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ కండిషన్ పడిపోతుంది. అనేక రకాలుగా మానిఫెస్ట్గా ఉండవచ్చు. ప్రస్తుతం అయితే ఈ వ్యాధికి ఎటువంటి నిర్ధారిత ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. కాకపోతే లక్షణాలను తగ్గించడంలో సహాయపడే తక్షణ చికిత్సలు ఐరోపాలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో డి విటమిన్ చికిత్స కూడా ఒకటి. శరీరం సాధారణ విధుల నిర్వహణకు సహాయపడేందుకు ఉపయోగపడే విటమిన్ డి లోపం కూడా చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అయితే శరీరంపై ఉండే తెల్లని మచ్చలు బొల్లి వ్యాధి బాధితులు సూర్యకాంతిలో ఎక్కువసేపు ఉండేందుకు సహకరించవు.
అయితే తాజాగా అందుబాటులో ఉంటున్న స్కిన్ క్రీమ్‌లు యూజర్ నాచురల్ స్కిన్ కలర్లోకి తాత్కాలికంగా తెచ్చేందుకు కొంత వరకు దోహదం చేస్తాయి. క్రీములు తెల్లటి బొల్లి మచ్చలను సాధారణ స్కిన్ కలర్‌తో కలిసిపోయేలా చేస్తాయి. అయితే ముఖంపై మాత్రం ఈ క్రీముల ప్రభావం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు మాత్రమే ఉంటుంది. స్టెరాయిడ్ ట్రీట్ మెంట్స్‌లో భాగంగా క్రీములను అన్వయించడం అనేది తెల్లటి పాచెస్ వ్యాప్తిని కొంత వరకు ఆపడానికి, నాచురల్ స్కిన్ కలర్లో కొంత భాగాన్ని పునరుద్ధరించడానికి సహాయపడాయి. మరో చికిత్సా విధానం ఫోటోథెరపీ. ఇది చర్మంపై ఆల్ర్టా వయోలెట్ కిరణాలను ఫోకస్ పెట్టి చేసే ట్రీట్మెంట్. అయితే ఈ ఆల్ర్టావయోలెట్ కిరణాలు స్కిన్ ట్రీట్ మెంట్లో ఎలా ఉపయోగపడతాయనేది పూర్తిగా అర్థంకాని సమస్యగానే ఉంది. అయితే ఇది సోరియాసిస్, తామర వంటి స్కిన్ ఆటో ఇమ్యూన్ కండీషన్లలో కూడా పాజిటివ్ రిజల్ట్‌ను ఇవ్వొచ్చు.
రుక్సోలిటినిబ్ ఉపయోగమేనా?
రుక్సోలిటినిబ్ ప్రధానంగా క్యాన్సర్ చికిత్సలలో మాత్రల రూపంలో ఉపయోగించబడుతుంది. ప్రత్యేకంగా ఎముక మజ్జ క్యాన్సర్లకు యూజ్ చేస్తారు. అయితే బొల్లి వ్యాధి కోసం క్రీమ్ వెర్షన్ (Opzelura)గా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్‌లో ఒక ట్యూబ్ ధర రెండువేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ: రూ.1,64,004.00)గా ఉంది. ఈ క్రీమ్ కొన్ని నెలల పాటు చర్మం వర్ణద్రవ్యాన్ని పునరుద్ధరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ట్రయల్స్‌లో రుజువు రుజువైంది. అయినప్పటికీ దీని వాడుక, చికిత్స నాచురల్ స్కిన్ ఇమ్యూనిటీ సిస్టంను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూజర్లు జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పైగా ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ఎర్ర రక్త కణాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందనే ఉద్దేశంతో యూరోపియన్ రెగ్యులేటర్లు, యుకె NHS రెండూ కూడా దీనిని అందుబాటులో ఉంచాలా వద్దా అని చర్చించుకుంటున్నాయి.
Also Read...
పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరగడానికి కారణం ఏంటో తెలుసా?