మీ మైండ్ షార్ప్‌గా పనిచేయాలా.. అయితే ఇలా చేయండి!

by Jakkula Samataha |
మీ మైండ్ షార్ప్‌గా పనిచేయాలా.. అయితే ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా మన మెదడు చాలా షార్ప్‌గా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. రోజూ మితంగా వ్యాయామం చేసే 50 ఏళ్ల సగటు వయసు ఉన్న పదివేల మందిని పరిశీలించగా , వారి మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాక వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నట్లు తేలిందంట.

రోజుకు 4,000 అడుగుల కంటే తక్కువ నడక వంటి మితమైన శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని పసిఫిక్ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క బ్రెయిన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ మెరిల్ అన్నారు. కనీసం రోజులో 10 నిమిషాల పాటు శారీరక శ్రమ.. నడవడం లేదా పరిగెత్తడం, గేమ్స్ ఆడటం లాంటివి చేయడం వలన రక్త ప్రసరణ పెరగడమే కాకుండా మెదడుకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలను అందిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అలాగే రోజూ నడవడం వలన న్యూరోట్రాన్స్మిటర్, కొత్త న్యూరాన్లు పెరగడమే కాకుండా మెదడు వాపును తగ్గిస్తుంది. అలాగే మానసికంగా ఆరోగ్యం ఉంటారు. ఇది ఆరోగ్యకరమైన మెదడుకు దోహదం చేస్తుందంట.

రోజూ 45 నిమిషాల పాటు మితమైన వ్యాయామం, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, మంచి జ్ఞాపక శక్తిని అందించి, సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార నైపుణ్యాలను అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ మొదలైనవాటిని తగ్గించడమే కాకుండా ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండటానికి తోడ్పడుతుందంట. అయితే వ్యాయామం మితంగా చేయడం మంచిదే, కానీ అతిగా చేయడం వలన మెదడు ఆరోగ్యాన్ని , ప్రధానంగా జ్ఞాపకశక్తిని దెబ్బతీసే అవకాశం ఉందని అతిగా చేయకుండా సరైన విధానంలో చేయాలంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story