Milk and jaggery : పాలు, బెల్లం.. ఇలా చేస్తే రక్తహీనత దూరం!

by Javid Pasha |   ( Updated:2024-12-05 13:13:09.0  )
Milk and jaggery : పాలు, బెల్లం.. ఇలా చేస్తే రక్తహీనత దూరం!
X

దిశ, ఫీచర్స్ : పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అందుకే సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే రోజూ పాలు తాగితే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే సాయంత్రం లేదా నిద్రకు కాసేపు ముందు పాలలో బెల్లం కలిపి తాగడంవల్ల చక్కగా నిద్రపడుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

నొప్పి నుంచి ఉపశమనం

సాధారణంగా చాలా మంది చలికాలంలో జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అజీర్తి, గ్యాస్, కడుపులో ఉబ్బరం, మలబద్దకం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటి సిచువేషన్ ఎదుర్కొంటున్నవారు పాలల్లో బెల్లం కలిపి తాగితే ఉపశమనం లభిస్తుందని, జీర్ణ క్రియ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాల్షియం పుష్కలంగా ఉండటంవల్ల పాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అయితే బెల్లంతో కలిపి తాగినప్పుడు దీంతోపాటు ఇంకా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే బెల్లంలో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.

రక్త హీనతకు చెక్

బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలు బెల్లం కలిపి తాగితే.. హిమోగ్లోబిన్ పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా వీటిలోపి పోషకాలు బాడీలో కొల్లాజెన్ పెంచడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల చర్మాన్ని స్మూత్‌గా, యంగ్‌గా మారుస్తాయి. పాలలోని లాక్టక్ ఆమ్లం తేలికపాటి ఎక్సోఫఓలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే గోరు వెచ్చని పాలలో బెల్లం కలుపుకొని రాత్రిపూట తాగితే ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed