Migration of birds : ఆగేదే లే..! వందలాది కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించే అరుదైన పక్షులివే..

by Javid Pasha |
Migration of birds : ఆగేదే లే..! వందలాది కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించే అరుదైన పక్షులివే..
X

దిశ, ఫీచర్స్ : ఈ ప్రకృతి సహజంగానే జీవ వైవిధ్యానికి నిలయం. అలాంటి వాటిలో పక్షులు కూడా ఒకటి. వీటిలోనూ అనేక రకాలు, భిన్న రంగులు, విభిన్న శరీర నిర్మాణాలు కలిగినవి అనేకం ఉంటాయి. ఆహారపు అలవాట్లు, వలస వెళ్లే విధానంలో కూడా ప్రత్యేకతలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘బార్ టెయిల్డ్ గాడ్‌విట్‌లు (Bar Tailed Godwit) ఆ కోవకు చెందినవే అంటున్నారు నిపుణులు. ఇవి బలమైన రెక్కలు, కండరాలను కలిగి ఉంటాయి. ప్రత్యేక శరీర నిర్మాణం కారణంగా మిగతా పక్షులతో పోలిస్తే.. మధ్యలో ఎక్కడా ఆగకుండా ఎక్కువ దూరం వరకు ప్రయాణిస్తూ వలస వెళ్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వలస పక్షులు సీజన్ల వారీగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. ఈ సందర్భంగా ఎండ, వాన, చలి, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కొన్ని రకాల పక్షులు అలసిపోవడంవల్ల, ప్రమాదాలకు గురివకావడంవల్ల మధ్యలో ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ బార్డ్ టెయిల్డ్ పక్షులు మాత్రం ఎగురుతూ వెళ్తున్నప్పుడు అలసిపోయే అవకాశం చాలా తక్కువ. అలాస్కా నుంచి న్యూజిలాండ్ వరకు తరచుగా వలసలు కొనసాగించే ఈ పక్షులు నిరంతరం ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా 8 రోజుల్లోనే 12000 కిలోమీటర్లు గాలిలో ఎగురుతూ వెళ్తాయి. పైగా మధ్యలో ఇవి ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

Next Story

Most Viewed