- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకుకూరల్లో మేటి గంగ వాయిలి.. ఈ మొక్క ప్రత్యేకత ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: మన పూర్వికులు చేలగట్లమీద, తోటల్లో లభ్యమయ్యే సహజమైన ఆకుకూరలను, కాయకూరలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. అందుకనే వాళ్లు 60 ఏళ్లు దాటినా ఎంతో శక్తివంతంగా దంతాలు కూడా ఊడిపోకుండా వందేళ్లు బతికేవారు. ఆకుకూరల్లో ఒకటి గంగ వాయిలి. ఈ ఆకు కూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకే ఆయుర్వేదంలో కొన్ని చికిత్సల కోసం ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో ఒమేగా-3 ఫ్యాటి ఆమ్లా పోషకాలు విరివిగా ఉంటాయి.
సాధారణంగా ఏ మొక్కలైనా సూర్యరశ్మి నీరు, కార్బన్ డై ఆక్సైడ్‌లను తీసుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. కానీ మొక్క జొన్న, చెరుకు వంటి మొక్కలు అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర కూడా శక్తిని తయారు చేసుకుంటాయి. దీన్ని సి-4 ఫొటోస్ సింథసిస్ అంటారు. కాక్టై అగేవ్... వంటి మొక్కలు ఎడారి వాతావరణాన్ని తట్టుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ రకమైన విధానాన్ని క్యామ్ ఫొటోస్ సింథసిస్ అంటారు. అయితే గంగవాయిలు మొక్క ఆకుల్లోని ఒకే కణంలో ఈ రెండు రకాల చర్యలు కనిపిస్తాయి. అందుకే ఇది ఎంత పెద్ద కరువునైనా తట్టుకొని పెరుగుతుంది. ఇది చాలా అరుదైన ప్రక్రియ.
ఇక ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి.. మన శరీరంలోని కొల్లాజెన్, రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. గంగవాయిల కూరలో అధికంగా బీటా కెరోటిన్ ఉంది. దీని కాండం, ఆకులు ఎర్రటి రంగుకు కారణమైన వర్ణద్రవ్యం. ఈ ఆకులలో కనిపించే అనేక యాంటీఆక్సిడెంట్లలో బీటా కెరోటిన్ ఒకటి. ఆకు కూరల్లో మేటి గంగ వాయిలి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని విరివిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్లు సైతం చెబుతున్నారు.
Also Read...
పావురాలను ఇంట్లో పెంచుకుంటే ధనలాభం.. ప్రేమ వివాహం జరుగుతాయా..?