Mental health: మెదడుపై ప్రభావం చూపుతున్న అవయవాల పనితీరు.. మానసిక రుగ్మతలకు అదే కారణమా?

by Javid Pasha |
Mental health: మెదడుపై ప్రభావం చూపుతున్న అవయవాల పనితీరు.. మానసిక రుగ్మతలకు అదే కారణమా?
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. అయితే వీటి పనితీరు మెదుడులో మార్పులను కలిగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని మెల్‌బోర్న్ యూనివర్సిటీ నిపుణుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా పరిశోధకులు ఆర్గాన్ హెల్త్, మెంటల్ హెల్త్‌కు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి మొత్తం 18000 మంది వ్యక్తుల ఆర్గాన్ హెల్త్ అండ్ బ్రెయిన్ ఇమేజింగ్ క్లినికల్ డేటాను విశ్లేషించారు.

డిప్రెషన్, యాంగ్జైటీస్

కాగా అవయవాల పనితీరు సక్రమంగా లేకపోవడం, బలహీన పడటం వంటివి సంభవించినప్పుడు ఆ సమాచారం మెదడుకు అందుతుందని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి ఆ సందర్భంలో పూర్ ఆర్గాన్ హెల్త్ మెదడులో మార్పులను తీసుకు రావడం ద్వారా అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకే అవయవాల పనితీరు సక్రమంగా లేనప్పుడు అది సదరు వ్యక్తుల్లో డిప్రెషన్ లేదా యాంగ్జైటీకి కారణం అవుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఏయే అవయవాలు ?

ముఖ్యంగా శరీరంలో జీవక్రియ రేటు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన అంశాలతోపాటు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటి అవయవ వ్యవస్థలను విశ్లేషించిన పరిశోధకులు, వాటి పనితీరు మెదడును ఎలా ప్రభావింతం చేస్తుందనేది గమనించారు. ఈ సందర్భంగా వారు అబ్జర్వ్ చేసిన 18 వేల మందిలో 10 వేలమందికి పైగా డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడటాన్ని గుర్తించారు. అందుకు కారణాన్ని ఎనలైజ్ చేసిన రీసెర్చర్స్ బలహీనమైన అవయవాల పనితీరు మెదడులో తీసుకొచ్చిన మార్పులు లేదా ప్రభావాల కారణంగానే బాధితులు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నట్లు నిర్ధారించారు. కాబట్టి మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, అవయవాల పనితీరు కూడా ముఖ్యమని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed