- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేటింగ్ టిప్స్.. ప్రొఫైల్‌లో కుక్క ఫొటోలతో గర్ల్స్ను ఈజీగా పడేయొచ్చు!
దిశ, ఫీచర్స్ : సింగిల్ మెన్ అండ్ ఉమెన్.. సరైన కంపేనియన్షిప్ కోసం డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తారని తెలిసిందే. కానీ ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సరైన పార్ట్నర్ను పొందడం పురుషులకు అనుకున్నంత ఈజీ కాదు. అయితే ఇవే సమస్యలపై పరిశోధించిన స్పెయిన్‌లోని జేన్ యూనివర్సిటీ దాదాపు 300 మంది ఫిమేల్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి డేటా సేకరించింది. దీని ప్రకారం పెంపుడు జంతువులు లేనివారి కంటే చిన్న కుక్కలను కలిగిఉన్న పురుషులతో మహిళలు ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటారని తేలింది.
ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్‌లో పెట్ డాగ్స్ ఫొటోలు కలిగిన పురుషులు మరింత సన్నిహితంగా, ఆకర్షణీయంగా భావించబడతారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగానే పరిశోధకులు కాలేజీ అమ్మాయిలకు ఒంటరిగా లేదా కుక్కతో నడుస్తున్న స్త్రీ పురుషుల చిత్రాలను చూపించారు. ఇలా లెక్కలేనన్ని ఫొటోలను చూపించిన తర్వాత చిన్న కుక్క పిల్లలతో ఉన్న పురుషులను ఫ్రెండ్లీ, అట్రాక్టివ్‌గా భావించారని నిర్ధారించారు. ఈ మేరకు చాలా భావోద్వేగ సందర్భాల్లో చిన్న పప్పీలు మాత్రమే మరింత సానుకూల భావోద్వేగ ప్రతిచర్యను, అధిక స్థాయి భద్రతను ప్రేరేపిస్తాయని ప్రస్తుత అధ్యయనం చూపిస్తోంది. అంటే కుక్క ఉనికికి సంబంధించి భావోద్వేగ, భద్రతా ప్రయోజనాలు కూడా దాని పరిమాణంతో సంబంధం కలిగి ఉండవచ్చని సూచిస్తోందని పరిశోధకులు వెల్లడించారు.
ఆసక్తికరంగా.. డేటింగ్ యాప్స్ ద్వారా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చూడాల్సిన కొన్ని ప్రధాన 'రెడ్ ఫ్లాగ్స్' గురించి ఒక ఫిమేల్ రెడిట్ యూజర్ షేర్ చేసిన కొద్ది రోజులకే ఈ పరిశోధన ఫలితం వచ్చింది. ఆమె తన ప్రొఫైల్‌లో 'నేను కుక్క యజమానిని. నాతో డేటింగ్ చేయబోయే వ్యక్తి కూడా ఇలాగే పెట్ డాగ్ కలిగి, ప్రేమను పంచేవాడైతే నాకు ఓకే' అని ప్రస్తావించింది. దీంతో కొంతమంది పురుషులు తమ ప్రొఫైల్‌లో వేరొకరి కుక్కతో పోజులిచ్చిన ఫొటో యాడ్ చేసి ఆమెను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించారని తన పోస్ట్‌లో వివరించింది.