మగాళ్లు బీ కేర్ ఫుల్: ఇలాంటి అలవాట్లు ఉన్నాయా?.. మహిళలు ఒక్క నిమిషం కూడా ఉండరు..

by Kavitha |
మగాళ్లు బీ కేర్ ఫుల్: ఇలాంటి అలవాట్లు ఉన్నాయా?..  మహిళలు ఒక్క నిమిషం కూడా ఉండరు..
X

దిశ, ఫీచర్స్: ఎన్నో ఊహలతో కొత్త బంధంలోకి అడుగు పెడతారు. కానీ చిన్న చిన్న కారణాలకే విడాకులు వరకు వెళ్లి పోతాము. ఈ రోజుల్లో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయడం అంటే నిప్పుల మీద నడవడం లాంటిది.. చిన్న పొరపాటు జరిగినా కూడా బ్రేకప్‌కి దారి తీస్తుంది. ముఖ్యంగా మీరు వివాహం చేసుకుని కొంత కాలం కలుసున్న తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు దానిని తట్టుకోవడం వీలుకాక విడిపోయే వైపుగా అడుగులు వేస్తారు. ముఖ్యంగా అబ్బాయిల గురించి చెప్పాలంటే.. అబ్బాయిల కొన్ని అలవాట్ల వల్ల, కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండకపోవడం వల్ల మీతో మీ మహిళా భాగస్వామి విడిపోయే అవకాశం ఉంది.. మరి విడాకుల దారిగా వెళ్తున్న కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

అనవసరంగా అనుమానించడం:

ఏదైనా బంధానికి పునాది వంటిది నమ్మకం. ముఖ్యంగా భార్యాభర్తలకి ఉండాల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం. మీరు ఏ కారణం లేకుండా మీ భార్యను అనుమానించినట్లయితే, ఆమె దాన్ని భరించలేక ఏదో ఒక రోజు మీతో విడిపోయి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వారి ఫోన్‌ను మళ్లీ మళ్లీ చెక్ చేయడం, ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు డౌట్స్ పడటం, లేకపోతే తన లోకేషన్ పంపమని సతాయించడం లాంటివి చేయడం వల్ల కూడా వారు మీకు బై బై చెప్పేయవచ్చు.

కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించవద్దు:

అబ్బాయిలు.. మీరు ఒకే ఇంట్లో లేదా వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నా, తమ పనిలో ఎంత బిజీగా ఉన్నా భాగస్వామితో మాట్లాడటానికి లేదా వారి మంచిచెడులు అడగడం కోసం కచ్చితంగా కొంత టైమ్‌ని కేటాయించండి. మీరు దూర ప్రయాణంలో ఉన్నప్పుడు మాట్లాడటం మరింత ముఖ్యం అనే విషయం అసలు మర్చిపోవద్దు.

అబద్ధం:

ముఖ్యంగా ఇప్పుడు చాలా బంధాలు విడిపోవడానికి ప్రధాన కారణం తమ భాగస్వామి తమతో అబద్ధాలు చెప్పడం. ఇది ముఖ్యంగా అమ్మాయిలకు అస్సలు ఇష్టం ఉండదు.. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌ని కలవబోతున్నా.. ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోబోతున్న.. మీరు వేరే ఉద్యోగంలోకి వెళ్లాలనుకుంటున్న.. మీ భాగస్వామి దగ్గర ఏదీ దాచవద్దు. ఎందుకంటే ఈ విషయాలు తర్వాత తెలిస్తే, గొడవలు అవుతాయి కాబట్టి.

జూదం, డ్రగ్స్, మద్యం, సిగరెట్ లాంటివి తీసుకోవడం:

మీరు సిగరెట్, ఆల్కహాల్ లేదా డ్రగ్స్, జూదం వంటి అలవాట్లు ఉండటం వలన మీ భార్యకి ఇబ్బంది కలిగి ఆమె మీతో ఉండలేక పోవచ్చు. మాదక ద్రవ్య వ్యసనం, మద్యం సేవించడం లేదా డ్రగ్స్ తీసుకోవడం ద్వారా స్పృహ కోల్పోయి ఆమెను కొట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. కాబట్టి, వీలైనంత త్వరగా ఈ అలవాట్లను వదులుకోవాలి.

Advertisement

Next Story