- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళ్లపై నరాలు ఉబ్బడం దేనికి సంకేతం?
దిశ, ఫీచర్స్ : కొంతమందికి కాళ్ల కండరాలపై నరాలు లేదా సిరలు పైకి ఉబ్బినట్లు కనిపించడం మీరెప్పుడైనా గమనించారా? వైద్య పరిభాషలో వీటిని వెరికోస్ వీన్స్ (Varicose veins) లేదా స్పైడర్ వీన్స్ అంటారు. స్కిన్‌కు దగ్గరగా రక్తనాళాల్లో వాపు రావడం కారణంగా ఇవి బయటకు కనిపిస్తాయి. వీటివల్ల ప్రారంభంలో బాధితులకు పెద్ద సమస్యగా అనిపించదు. కాకపోతే శ్రమతో కూడిన పనిచేస్తున్నప్పుడు, జర్నీలో భాగంగా బస్సుల్లో, ట్రైన్లలో నిలబడినప్పుడు మాత్రం కాళ్లు లాగుతున్నట్లు అనిపించవచ్చు.
రీజన్ ఇదే
వెరికోస్ వీన్స్(సిరలు) ఏర్పడటానికి ప్రధాన కారణం కాళ్ల నుంచి గుండెకు బ్లడ్ సర్క్యూట్ చేసే రక్తనాళాల్లో ఆటంకం లేదా వాపు రావడం. భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి రక్తం గుండె వైపు రావడం కోసం, ఆ రక్తనాళాలలో చిన్న కవాటాలు(valves) ఉంటాయి. కాలు కండరాలు సంకోచించినప్పుడు ఇవి రక్తం కేవలం గుండె వైపు వెళ్లేలా చేయడంలో దోహదపడతాయి. ఫలితంగా రక్తం కాళ్లలో నిలిచిపోకుండా ఉంటుంది. శారీరక బలహీనత, మరేదైనా కారణంవల్ల ఈ వాల్వ్ వీక్‌నెస్ అయినప్పుడు రక్తం, ఎక్కువగా శాతం ఆ రక్తనాళాలలో పేరుకు పోవడంవల్ల వాపు వస్తుంది. మరొక ప్రధాన కారణం వృద్ధాప్యం. వయసు పెరగడంతో సిరలలోని కవాటాలు బలహీనపడి, రక్తనాళాలు వాపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వివిధ హార్మోన్ల ప్రభావంవల్ల, వెరికోస్ వీన్స్ ప్రాబ్లమ్స్ లేడీస్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గర్భిణుల్లో బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ కావడంవల్ల కూడా రక్తనాళాలు లేదా సిరల్లో వాపు కనిపించొచ్చు. అంతేకాకుండా ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారి సంతానానికి రావచ్చు. ఒబేసిటీ ఉన్నవారిలోనూ వెరికోస్ వీన్స్ సమస్య వచ్చే చాన్స్ ఎక్కువ. తరచుగా నిలబడి ఉండటంవల్ల లేక, ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చొని ఉండే లైఫ్ స్టయిల్ వల్ల కూడా ఇలా వాపు కనిపించే అవకాశం ఉంది.
లక్షణాలు
ప్రారంభంలో కాళ్ల కండరాలపై నరాలు ఉబ్బడం గమనించవచ్చు. కొంత కాలానికి కాళ్లు బరువుగా అనిపించడం, లైట్‌గా లాగడం, పెయిన్ వంటివి మొదలవుతాయి. ఒక్కోసారి నరాల పక్కన దురద, స్కిన్ కలర్ మారడం కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవడం(thrombus)తో నొప్పి తీవ్రత పెరగవచ్చు. ఈ విధంగా గడ్డకట్టిన రక్తం అక్కడి నుంచి రిలీజై ఏదైనా ముఖ్య అవయవానికి చేరి, రక్తనాళాల్లో అడ్డుపడితే అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు. కొంతమందిలో పుండ్లు (venous ulcer) ఏర్పడి, త్వరగా మానకుండా ఇబ్బంది పెడతాయి. ఇలాంటప్పుడు ఉబ్బిన రక్తనాళం సాధారణ పరిస్థితికి పూర్తిగా రావడం అనేది జరగకపోవచ్చు. అప్పుడు సర్జరీ అవసరం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.
జాగ్రత్తలు
వెరికోస్ వీన్స్ సమస్య ఉన్నవారు రక్తనాళాల వాపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఎక్కువసేపు ఒకే చోట నిలబడి ఉండడమో, కదలకుండా కూర్చోవడమో చేయకూడదు. తరచూ కదలిక అవసరం కాబట్టి మధ్య మధ్యలో నడస్తూ ఉండాలి. దీనివల్ల రక్త ప్రసరణ జరిగి ఉపశమనం లభిస్తుంది. ఇక ఒబేసిటీ ఉన్నవారు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఫైబర్, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్‌గా వాకింగ్, రన్నింగ్ వంటివి కొనసాగించాలి. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లు ఎత్తులో ఉండేలా దిండు పెట్టుకుంటే రిలాక్స్ అవుతారు.
ట్రీట్‌మెంట్
రక్త నాళాలు (కాళ్లలోని సిరలు)వాపు వచ్చినప్పుడు దాదాపు ఈ సమస్య తగ్గే అవకాశం ఉండదు. కాకపోతే అధికం అవకుండా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అరుదుగా రక్తనాళాల వాపు, నొప్పి సమస్య ఎక్కువైన్పుడు డాక్టర్లు శస్త్ర చికిత్సను సిఫార్సు చేస్తారు. లైగేషన్, స్ట్రిప్పింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ట్రీట్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
Read more: