వారెవ్వా మినీ గోవా.. జీవితంలో ఒక్కసారైనా ఈ ట్రిప్ వేయాల్సిందే..

by Sumithra |
వారెవ్వా మినీ గోవా.. జీవితంలో ఒక్కసారైనా ఈ ట్రిప్ వేయాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు ఓ మంచి ప్రదేశానికి ట్రిప్ వేయాలనుకుంటారు. అయితే గోవా వెళ్లడం సాధ్యం కాని వాళ్లు మినీ గోవాకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఈ మినీ గోవా ఎక్కడ ఉంది అనుకుంటున్నారా. మరెక్కడో కాదండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ అందమైన మినీ గోవా ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి, విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతం బంగాళాఖాతానికి సమీపంలో ఉన్నందుకు పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాష్ట్రం బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బీచ్‌లు చాలా శుభ్రంగా, అందంగా, పర్యాటకులను ఆకర్షించుకునేలా ఉంటాయి. అచ్చం గోవాను తలపించేలా ఉండడం వల్లనే బెంగాల్‌ను మినీ గోవా అని కూడా పిలుస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మౌసుని దీవిని మినీ గోవా అంటారు. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ద్వీపం సరిహద్దు ద్వీపాలలో ఒకటి. మినీ గోవాగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీపాన్ని చూడటానికి పర్యాటకులు ఏడాది పొడవునా వస్తూనే ఉంటారు.

మౌసుని ద్వీపం ప్రత్యేకత ఏమిటి ?

మౌసుని ద్వీపం ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇక్కడి వాతావరణం సంగీతం లేకుండానే మీతో డాన్స్ వేయిస్తుంది. బీచ్ ఒడ్డున కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ కనిపించే దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మినీ విలేజ్ అని పిలువబడే ఈ ద్వీపం పర్యాటకానికి మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఈ తీరం చుట్టూ నివసించే ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో పిక్నిక్ కోసం ఇక్కడకు వస్తుంటారు. వారాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. మౌసుని ద్వీపం చుట్టూ ఇలాంటి అనేక ద్వీపాలు ఉన్నాయి, వీటిని మీరు ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే.

1. జంబూ ద్వీపం..

మౌసుని ద్వీపం సమీపంలోని జంబూ ద్వీపం పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందింది. సాయంత్రం సముద్రం నుంచి వచ్చే అలలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ద్వీపాన్ని చూడాలంటే ముందుగా స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి.

2.బక్కలి

బక్కలి పేరుతో ప్రసిద్ధి చెందిన మౌసుని ద్వీపం సమీపంలో అందమైన, ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువ కాదని అనుకునేలా చేస్తుంది. మౌసుని ద్వీపం నుండి బక్కలి చేరుకోవడానికి పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

3.అడ్వెంచర్ యాక్టివిటీ..

పశ్చిమ బెంగాల్‌లోని మినీ గోవాను అన్వేషించాలనుకుంటే ఇక్కడ సాహస కార్యకలాపాలను చేయడం మర్చిపోవద్దు. వాటర్ స్కీయింగ్, జెట్ స్కీయింగ్ కాకుండా, మీరు మౌసుని ద్వీపంలో స్కూబా డైవింగ్ కూడా చేయవచ్చు. ఇది కోల్‌కతా నుండి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed