- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Problems : డెంగ్యూ, మలేరియా మాత్రమే కాదు.. దోమలతో వచ్చే మరిన్ని వ్యాధులు ఏంటో చూసేద్దామా..
దిశ, ఫీచర్స్ : వర్షాకాలం సాయంత్రం వేళల్లో దోమల బెడద బాగా పెరిగి డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఎవరైనా దోమ కాటు వల్ల వ్యాపించే వ్యాధుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ రెండు రకాల జ్వరాలు మాత్రమే. అయితే దోమ కాటు వల్ల అనేక ఇతర వ్యాధులు కూడా వస్తాయని చాలామందికి తెలిసి ఉండదు. వర్షాకాలంలో దోమలు చర్మం పై దద్దుర్లు, చికాకు, దురదలను కలిగించడమే కాకుండా అనేక వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. కాబట్టి దోమల నుండి రక్షణ చాలా ముఖ్యం. వర్షాకాలంలో అనేక రకాల రకాల దోమలు రూపాంతరం చెందుతాయి. వాటి ద్వారా అనేక రకాల వ్యాధులు కూడా సంభవిస్తాయి. మరి ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికున్‌గున్యా జ్వరం..
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా కాకుండా, చికున్‌గున్యా ఫీవర్ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. ఏడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. ఇందులో జ్వరంతో పాటు చేతులు, కాళ్ల కీళ్లలో విపరీతమైన నొప్పి, చర్మం పై దద్దుర్లు, వికారం మొదలైన సమస్యలు మొదలవుతాయి.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి..
క్యూలెక్స్ దోమలు కుట్టడం వల్ల జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీని లక్షణాల గురించి చెప్పాలంటే మొదట్లో తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జికా వైరస్..
జికా వైరస్ డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాలను వ్యాప్తి చేసే ఏడిస్ దోమల జాతికి చెందిన దోమల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ దోమలు వెచ్చని, తేమతో కూడిన లోతట్టు ప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి. ఇది ఒక అంటు వైరస్. ఈ వైరస్ గర్భిణీ స్త్రీకి చాలా హానికరం.
ఎల్లో ఫీవర్...
డెంగ్యూ ఫీవర్ లాగానే ఎల్లో ఫీవర్ కూడా చాలా ప్రమాదకరం. ఈ జ్వరం సోకిన వ్యక్తి కామెర్లతో బాధపడవచ్చు. ఈ జ్వరం కూడా ఈడిస్ జాతికి చెందిన దోమల ద్వారా వ్యాపిస్తుంది. మొదట్లో తలనొప్పి, కండరాల నొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. ఇందులో ముక్కు, నోటి నుండి రక్తస్రావం కూడా సంభవించవచ్చు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.