గుడ్‌బై మంగళ్‌యాన్.. భారతదేశ తొలి మార్స్ మిషన్‌లో ఇంధనం ఖాళీ?

by Seetharam |
గుడ్‌బై మంగళ్‌యాన్.. భారతదేశ తొలి మార్స్ మిషన్‌లో ఇంధనం ఖాళీ?
X

దిశ, ఫీచర్స్ : అంగారక గ్రహంపైకి భారతదేశ మొదటి యాత్ర అయిన 'మంగళ్‌యాన్‌' తన గమ్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్(MOM) నివేదిక ప్రకారం మంగళ్‌యాన్‌లో ప్రొపెల్లెంట్ అయిపోయిందని, ఇక రెడ్ ప్లానెట్ కక్ష్యలో పునరుద్ధరించబడటం కష్టమని తెలుస్తోంది. ఈ వార్త MOMs తమ ప్రయాణాన్ని పూర్తి చేసినట్లుగా నిర్ధారణకు దారితీస్తోంది. అయితే ఇస్రో అంతరిక్ష విభాగం ఇప్పటివరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

భారతదేశ తొలి ఇంటర్ ప్లానెట్ మిషన్ 'మంగళయాన్' 2013లో PSLV-C25లో ప్రారంభించబడింది. ఇది ఇస్రోకు సంబంధించి నాల్గవ అంతరిక్ష సంస్థగా అవతరించింది. $74 మిలియన్ల బడ్జెట్‌లో అత్యంత ఎకనామికల్‌గా సృష్టించబడిన గ్రహాంతర మిషన్లలో ఇదీ ఒకటి. కాగా మంగళయాన్‌లో ఇంధనం పూర్తిగా అయిపోయిందని పీటీఐ న్యూస్ సోర్స్ జోడించింది. 'ఇటీవల ఏడున్నర గంటల పాటు కొనసాగిన గ్రహణాలు సహా పలు గ్రహణాలు బ్యాక్ టు బ్యాక్ సంభవించాయి. కానీ శాటిలైట్ బ్యాటరీ కేవలం ఒక గంట 40 నిమిషాల గ్రహణ వ్యవధిని మాత్రమే నిర్వహించేలా రూపొందించబడింది. కాబట్టి సుదీర్ఘ గ్రహణం బ్యాటరీని సురక్షిత పరిమితికి మించి ఖాళీ చేస్తుంది' అని పీటీఐ కథనంలో తెలిసింది.

రెడ్ ప్లానెట్ పదనిర్మాణం, ఖనిజశాస్త్రంతో పాటు అక్కడి వాతావరణాన్ని పరిశోధించేందుకు ఐదు పరికరాలతో MOM డిజైన్ చేయబడింది. ఇస్రో అధికారుల ప్రకారం.. 'కాస్ట్-ఎఫెక్టివ్‌నెస్, తక్కువ వ్యవధిలో రియలైజేషన్, ఎకనామిక్ మాస్-బడ్జెట్, ఐదు భిన్నమైన సైన్స్ పేలోడ్స్ సూక్ష్మీకరణ వంటి అనేక అవార్డులతో MOM ఘనత పొందింది.

అయితే పై విషయానికి సంబంధించి ఇస్రో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇస్రో మాజీ డైరెక్టర్ జనరల్ కె శివన్ మాత్రం ఇండియా యొక్క అప్‌కమింగ్ మిషన్ 'చంద్రయాన్ -3' తర్వాత మంగళయాన్ -2 ప్రయోగించబడుతుందని పేర్కొన్నారు. కాగా రెండో మార్స్ మిషన్ ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది.

Advertisement

Next Story

Most Viewed