- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియల్ అపరిచితుడు: ఒకే వ్యక్తిలో పది వ్యక్తిత్వాలు.. ఎప్పుడు ఎవరు బయటకొస్తారో తెలియదు!
దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తికి ఒకటికి మించిన పేర్లుంటేనే జనాలు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటిది పది పేర్లతో పాటు వాటికి సంబంధించి డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్స్ కలిగి ఉండటమంటే మాటలు కాదు. జర్మనీకి చెందిన లియోనార్డ్ స్టాక్ అలాంటి అరుదైన పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా అతను చదువు, పనికి దూరమవడమే కాక ఇల్లు విడిచి బయటకు వెళ్లలేకపోతున్నాడు.
మ్యూనిచ్‌లో నివాసముండే లియానార్డ్‌కు డిసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్(DID) ఉంది. ఇది సీవియర్ ట్రామ్ కారణంగా చిన్నతనంలోనే అభివృద్ధి చెందే అరుదైన సైకియాటిక్ కండిషన్. ఈ కారణంగా అతను 'కోవు(4), హెక్టార్(8), ఆనా(16), కాస్మో(17), యాష్(18), జెస్సీ(19), లియో(21), బిల్లీ(23), లివ్(24), రెడ్(26)' పేర్లు గల మల్టిపుల్ పర్సనాలిటీస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సామూహిక వ్యక్తిత్వాలను తన 'సిస్టమ్'గా, ప్రస్తుతం స్పృహలో ప్రతీ ప్రత్యేక రూపాన్ని 'వ్యక్తి' లేదా దానికి 'మార్పు'గా అతను సూచిస్తున్నాడు. ఇక తనను తాను సిస్టమ్‌కు 'హోస్ట్'గా పేర్కొన్న లియోనార్డ్.. యుక్తవయస్సులో ఈ పరిస్థితిని మేనేజ్ చేయగలిగినప్పటికీ గతేడాది జూన్‌లో తన A-లెవెల్ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నప్పుడు కండిషన్ చేయిదాటిపోయింది. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోయాడు. తరచూ వ్యక్తిత్వాలు మారడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం సహా ఇతర లక్షణాలతో బాధపడ్డాడు.
మార్చి 2022లో అతనికి DID ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత దీని నుంచి ఉపశమనం పొందినట్లు భావించినప్పటికీ, అతని ప్రతి వ్యక్తిత్వానికి వేర్వేరు సొంత సామర్థ్యాలు, కోరికలు ఉన్నందున పని చేయడం కష్టమైంది. ప్రస్తుతం Etsyలో ఒక దుకాణాన్ని నడుపుతున్న లియోనార్డ్.. హ్యాండ్ మేడ్ బుక్‌మార్క్స్, టోట్ బ్యాగ్స్ విక్రయిస్తున్నాడు. కాగా లియో తన మేల్ పార్ట్‌నర్ మాసిమోతో కలిసి నివసిస్తున్నాడు. అయితే పది వ్యక్తిత్వాల్లో ఒక్కొక్కరికి బలమైన సొంత అభిప్రాయాలు ఉన్నందునా.. మాసిమోతో రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపించేవి. అయితే రిలేషన్‌లో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సిస్టమ్ 'మద్దతు గొప్ప మూలం' అని అతను పేర్కొన్నాడు.