- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తున్న బుద్ధ విగ్రహాలు
దిశ, ఫీచర్స్ : బుద్ధుని విగ్రహాన్ని చూస్తున్నప్పుడు కలిగే ప్రశాంతతను ఎవరూ కాదనలేరు. అందుకే ఒకరి నమ్మకాలతో సంబంధం లేకుండా ఇంటి వాస్తుకు సంబంధించి బుద్ధ విగ్రహం ఒక ప్రత్యేకమైన కల్చర్‌గా, గృహ సౌందర్యానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే తొమ్మిది క్యూబ్‌ల వాస్తు గ్రిడ్ ప్రకారం బుద్ధుడిని ఏ దిశలో నిలపాలో తెలుసుకోవడం శ్రేయస్సు, ఆరోగ్యంతో పాటు శాంతిని పెంపొందించగలదని నిపుణులు చెప్తున్నారు. అలాగే మీరు సానుకూల ఫలితాలను ఆశిస్తున్న విషయంపై ఆధారపడి నివాసం లేదా కార్యాలయం చుట్టూ బుద్ధుని విగ్రహం లేదా వస్త్రాన్ని ఎలా ఉంచాలనే దానిపై కొన్ని అదృష్ట చిట్కాలను అందిస్తున్నారు. అవేంటో చూద్దాం..
* సామరస్యానికి 'స్లీపింగ్ బుద్ధ'
ఒక చేతిని తలకు మద్దతుగా నిలిపి ప్రశాంతంగా కనిపించే బుద్ధుడి రూపమే 'స్లీపింగ్ బుద్ధ'. ఈ ముద్రలో కనిపించే తనను శక్యముని లేదా నిర్వాణ బుద్ధుడు అని పిలుస్తారు. అంతులేని పునర్జన్మ చక్రాల నుంచి తనను తాను విడుదల చేసుకునే చివరి శ్వాసను ఈ స్టిల్ సూచిస్తుంది. కాబట్టి రిలేషన్‌షిప్స్‌లో సామరస్యాన్ని కోరుకునేవారు ఈ బొమ్మను డ్రాయింగ్ రూమ్ లేదా వరండా మధ్యభాగంలో ఉంచాలి.
* ఏకాగ్రత కేంద్రీకరణకు ధ్యాన బుద్ధుడు
ఈ డిజిటల్ డైవర్షన్స్ యుగంలో జనాలందరికీ ఏకాగ్రత ఒక సమస్యగా మారింది. అందుకే ఏ పని మీదనైనా దృష్టి కేంద్రీకరణ పెరగాలంటే పోర్టబుల్ వాటర్ ఫౌంటెన్‌తో పాటు ఈశాన్య మూలలో ధ్యాన బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది.
* భూమిస్పర్ష్ బుద్ధతో సమస్యల పరిష్కారం
భూమిస్పర్ష్ ముద్రలో బుద్ధుడి ఎడమ చేతి తన ఒడిలో ఉంటుంది. కుడిచేయి నేల వైపు చూపుతుంది. ఈ బుద్ధుడి రూపం శాశ్వతమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. సమస్య-పరిష్కార విధానాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా పరిష్కరించలేని సంక్షోభంలో ఉన్నారని అనిపిస్తే ఈ ముద్రలో ఉన్న బుద్ధుడిని తూర్పున లేదా నివాసం మధ్యన బ్రహ్మస్థానంలో ఉంచాలి.
* గార్డియన్‌గా ప్రొటెక్షన్ బుద్ధ
ఒక చేతితో వరమిస్తున్నట్లుగా కనిపించే ఈ అవతార్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఇది ప్రమాదం లేదా చెడు కన్ను నివారణకు కవచంగా పనిచేస్తుంది. ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉంచడానికి ఈ ముద్రలో ఉన్న విగ్రహాన్ని ముందు తలుపుకు ఎదురుగా ఉంచాలి. 'బుద్ధుడు సాధారణంగా ఓరియంటల్(ఆసియా) సంస్కృతులతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ 'ప్రొటెక్షన్ బుద్ధ' వెంటనే సమీపంలోని ఏదైనా వాస్తు లోపాలను తొలగిస్తుందని వాస్తు నిపుణుల అభిప్రాయం.
* వైద్యం కోసం మెడిసిన్ బుద్ధ
ఎడమ చేతిలో ఉన్న మూలికల గిన్నె మెడిసిన్ బుద్ధుని బహుమతి. ఆరోగ్యం, ఆశీర్వాదం కోసం లేదా అనారోగ్యాల నుంచి ఉపశమనానికి ఈ విగ్రహాన్ని ఉత్తరం, ఈశాన్య భాగానికి మధ్యన లేదా ఏదైనా ప్రకాశవంతమైన, వెలుతురు ప్రసరించే గదిలో ఉంచాలి. ప్రత్యామ్నాయంగా కాంస్యం, రాగితో చేసిన లోహపు విగ్రహాలను ఆరోగ్యం, శ్రేయస్సు కోసం వాయువ్యంలోనూ ఉంచవచ్చు.
* పరీక్షల్లో మంచి ఫలితాల కోసం వితర్క బుద్ధ
హిందువులు జ్ఞాన దేవతగా కొలిచే సరస్వతికి సమానమైన అంశాలతో ఈ అవతార్‌లోని ముద్ర బుద్ధుని బొటనవేలు, చూపుడు వేలు ఒకదానికొకటి తాకడం ద్వారా నిరంతర జ్ఞాన ప్రవాహాన్ని సూచిస్తుంది. అకడమిక్ ఎక్సలెన్స్‌ని పొందడానికి ఈ విగ్రహాన్ని స్టడీ, లైబ్రరీ రూమ్ లేదా ఆఫీస్ డెస్క్‌లో తూర్పు ముఖంగా ఉంచాలి.
* మానసిక ఆరోగ్యం కోసం 'హెడ్ ఆఫ్ బుద్ధ'
'హెడ్ ఆఫ్ బుద్ధ' అనేది సాధారణ లివింగ్ రూమ్‌లో ఒక అలంకరణ వస్తువు. అయితే ఇది ఉత్తరం లేదా తూర్పుకు చెందినది. ఎందుకంటే ఈ దిశలు మనసుతో ముడిపడి ఉంటాయి. మీరు ఆందోళన లేదా నిరాశతో బాధపడుతుంటే మీ ఇంటిలో ఈ దిశలను విడదీసి అక్కడ బుద్ధుని శిరస్సును ఉంచాలి.
మెటీరియల్ కంఫర్ట్స్ కోసం 'ఉడెన్ బుద్ధ'
ఈ బుద్ధుడు కాఠిన్యంతో అనుసంధానించబడ్డాడు. మీకు సంపద, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం అవసరమైతే ఆగ్నేయంలో ఈ చెక్క బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవాలి.
సంతాన సాఫల్యం కోసం బేబీ బుద్ధాస్
సిద్ధార్థుడు సన్యాస యోగ అన్వేషణలో బ్రహ్మచారి అయ్యిండవచ్చు. కానీ సంతానం కలగడంలో సమస్యలు ఎదుర్కొంటున్న దంపతులు తమ బెడ్‌రూమ్‌లో బేబీ మాంక్ బుద్ధుల విగ్రహం పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. ఇక ఈ ప్రాసెస్ స్పీడప్ కోసం తూర్పు ఏసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన 'జాడే' క్రిస్టల్‌ను ఈ విగ్రహాల పక్కనే పెడుతుంటారు.
బిజినెస్‌మ్యాన్ బుద్ధ
కార్యాలయంలో ఎప్పుడూ బుద్ధుడి విగ్రహాన్ని మన కంటి స్థాయికి సమానంగా లేదా అంతకంటే పైన ఉంచాలి. అంతేకాదు కార్యాలయం లోపలి వైపు ఉండేలా చూసుకోవడంతో పాటు ఎప్పుడూ తలుపు వైపునకు వెళ్లకూడదు. తూర్పు లేదా ఈశాన్యంలో ఉంచినట్లయితే, దానిని ఎప్పుడూ రెడ్ కార్పెట్ మీద ఉంచవద్దు.
ఏం చేయకూడదు :
* గార్డెన్‌లో ఏర్పాటుచేసిన విగ్రహమైనప్పటికీ ఎప్పుడూ బుద్ధుని కింద కార్పెట్, రగ్గు లేదా కనీసం వెదురు చాపనైనా ఉంచాలి.
* స్పా లాంటి వాతావరణంలోనూ విగ్రహాన్ని ఎప్పుడూ బాత్రూమ్ లేదా కప్‌బోర్డ్‌లో ఉంచవద్దు.
* వాస్తు ఇంటికి బుద్ధుని విగ్రహాన్ని షూ రాక్ పైన లేదా మెట్ల క్రింద ఎప్పుడూ ఉంచవద్దు.
* వంటగదిలో బుద్ధుని విగ్రహాన్ని అస్సలు ఉంచవద్దు. వంటగదిలో పూజా మండపాలను సృష్టించే హిందూ కుటుంబాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.
* జెయింట్ టెలివిజన్ లేదా హోమ్ కంప్యూటర్ వంటి స్మార్ట్ పరికరాల పక్కన బుద్ధుని విగ్రహాన్ని నేరుగా ఉంచవద్దు. ఇది అన్ని వైద్యసంబంధిత చికిత్స అంశాలను తగ్గిస్తుంది.