- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Aging:చిన్నతనంలో ఆత్మీయులను కోల్పోతే త్వరగా వృద్ధాప్యం వస్తుందా.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
దిశ,వెబ్‌డెస్క్: మనం చిన్నప్పటి నుంచి కుటుంబీకులతో ఎంతో ఆనందంగా, అప్యాయత, ప్రేమానురాగాలతో గడుపుతాము. నిజానికి మానవ సంబంధాలు, కుటుంబల బాందవ్యాలలో ఒకప్పుడు ఉన్న ప్రేమ ప్రజెంట్ చోటుచేసుకుంటున్న విపరీత మార్పుల వల్ల తగ్గిపోతుందనే చెప్పవచ్చు. ఆ రోజుల్లో మనసులో స్వచ్ఛత, స్నేహంలో నిజాయితీ, బంధంలో ఆత్మీయత కనిపించేవి కానీ ప్రస్తుత కాలంలో అవి దూరం అయ్యాయి. స్వార్థం ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాల కోసం కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని, బంధుత్వాల్లో అనుబంధాలు సన్నగిల్లి పోతున్నాయని, మనుషుల మధ్య మమతానురాగాలు మాయమైపోతున్నాయని ఎంతో మంది బాధపడుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. అయితే చిన్నతనంలోనే ఆత్మీయులను కోల్పోవడం చాలా బాధాకరం. ఆ ఆవేదన నుంచి కోలుకోవడం చాలా కాలం వరకు సాధ్యం కాదు. దీని ప్రభావం జీవించి ఉన్న వారి వృద్ధాప్యం పై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆత్మీయులను కోల్పోయిన వారు వేగంగా వృద్ధులు అవుతున్నట్టు కొలంబియా యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆ పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..తల్లిదండ్రులు, భార్య, భర్త, తోబుట్టువులు, పిల్లలను కోల్పోయిన వారు, అటువంటి ఘటనలు ఎదుర్కొని వారి మధ్య వృద్ధాప్యం ఏ విధంగా వస్తుందన్న విషయాన్ని అధ్యయనం చేశారంట. చిన్నప్పుడే తల్లిదండ్రులను, తోబుట్టువులను కోల్పోయిన వారు ఆ బాధను జీవితాంతం అనుభవిస్తారని, ఇది మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలకు దారితీసే అవకాశం ఉందని తాజా అధ్యయనం వివరించింది. బాల్యం, కౌమార దశలో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో ఆత్మీయులను కోల్పోయిన వారు వేగంగా వృద్ధులు అవుతున్నట్టు వారు తాజా అధ్యయనంలో వెల్లడించారు. బాల్యం నుంచి పెద్దలు అయ్యే వరకు ఆత్మీయులను కోల్పోవడానికి, జీవ సంబంధిత వృద్ధాప్యం వేగవంతం కావడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు.