DOG Vs LION : చీకట్లో సింహాలకు చుక్కలు చూపించిన కుక్కలు... గేటు దగ్గరే యుద్ధం ప్రకటించాయి...(VIDEO)

by Sujitha Rachapalli |
DOG Vs LION : చీకట్లో సింహాలకు చుక్కలు చూపించిన కుక్కలు... గేటు దగ్గరే యుద్ధం ప్రకటించాయి...(VIDEO)
X

దిశ, ఫీచర్స్ : కుక్కకు ఉన్న విశ్వాసం మరో జంతువుకు ఉండదని అంటుంటారు. ఈ నాలుగు కాళ్ల స్నేహితుడిని నమ్ముకుంటే ఎలాంటి కష్టం నుంచైనా గట్టెక్కిస్తుందని చెప్పేందుకు చాలా రుజువులు ఉన్నాయి. ఇలాంటి మరో ఉదాహరణ నెట్టింట వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే.. ఓ ఊరి చివర ఉన్న బంగ్లా ఓనర్ రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో అడవి నుంచి వచ్చిన సింహాలు.. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఒక దాని వెనుక ఒకటి వచ్చాయి. గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా.. కుక్కలు విరుచుకుపడ్డాయి. గేటు ఓపెన్ కూడా చేయకుండా జాగ్రత్తపడుతూ యుద్ధం ప్రకటించాయి. దీంతో బెదిరిపోయిన సింహాలు పారిపోయాయి. ఈ సీన్ అయిపోయాక వచ్చిన ఓ అంకుల్ లైట్ వేసి చూస్తే.. అక్కడ ఏమీ లేదు. వార్ అప్పటికే ముగిసింది.

గుజరాత్ అమ్రేలికి చెందిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 'నేను అయితే వీడియో చూశాక అంకుల్ అక్కడ సింహం ఉందని అరిచేసా' అని ఒకరు కామెంట్స్ చేస్తే.. 'నాకు అయితే భయంతో హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఎక్కడ ఆ ముసలాయన మీద ఎటాక్ జరుగుతుందని చెమటలు పట్టేసాయి ' అని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి వీడియో చూసాక ముసలాయన పరిస్థితి.. ' బాబోయ్ ఇంత జరిగిందా.. టైం బాగుండి బతికిపోయా ' అనుకుని ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story