- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్కవుట్స్‌తో తప్పని ఎటాక్.. తీవ్రమైన వ్యాయామాలతో గుండెపోటు ?
దిశ, ఫీచర్స్ : ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఈ నెల 10న జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలి కాలంలో కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్‌తో చనిపోయేందుకు కూడా ఇంటెన్సివ్ వర్కవుట్స్ కారణమని తెలిసిందే. ఈ క్రమంలోనే సడెన్ కార్డియాక్ డెత్‌కు తీవ్రమైన శారీరక శ్రమతో సంబంధముందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరి నిజంగానే అధిక తీవ్రత గల వ్యాయామం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
సాధారణంగా గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో అడ్డంకి ఏర్పడినపుడు గుండెపోటు వస్తుంది. 'కరోనరీ ఆర్టరీలో 70 శాతానికి మించి దీర్ఘకాలిక అవరోధం 'ఆంజినా లేదా ఛాతి నొప్పి'కి కారణమవుతుంది. ఎందుకంటే శరీరంలో అందుబాటులో ఉన్న రక్త సరఫరా.. వ్యాయామ సమయంలో పెరిగిన ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చలేదు. ఇలాంటప్పుడే హృదయ ధమనుల్లో ఏర్పడే మృదువైన ఫలకాలు పగిలి భారీ క్లాట్స్‌గా ఏర్పడి గుండెపోటు(తీవ్రమైన మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) సంభవించవచ్చు. ఇది ముందస్తు హెచ్చరిక లక్షణాలు లేకుండా రావచ్చు. 30 శాతం ఫలకాలు కూడా పగిలి పెద్ద అబ్‌స్ట్రక్టివ్ క్లాట్ ఏర్పడటానికి దారితీస్తాయి' అని కార్డియాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(PHFI) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు.
అయితే కొవ్వు(లిపిడ్స్, కొలెస్ట్రాల్), ధమని గోడపై కణ నిక్షేపాలు(ఇంట్లోని ప్లంబింగ్ పైప్స్‌లో బ్లాక్స్ మాదిరి) వలన బ్లాకేజ్ ఏర్పడుతుందనే దురభిప్రాయం చెలామణిలో ఉంది. కానీ ఈ భావన తప్పనేది రెసొనెన్స్ లేబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ గోర్ అభిప్రాయం. 'కణాలు, కొవ్వు కణాలు ఎండోథెలియల్ కణాల అవరోధాన్ని ఛేదించి ధమని లైనింగ్‌లోకి చొరబడటం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా ధమని గోడలో ఒక బంప్(మొటిమ వంటిది) పుట్టుకొస్తుంది. దీనినే 'ఫలకం(ప్లేక్) లేదా స్టెనోసిస్' అంటారు. ఈ ఫలకం ధమనిలోకి ఉబ్బిపోవలసిన అవసరం లేదు కానీ బయటికి కూడా పొడుచుకు వస్తుంది. కరోనరీ ఆర్టరీ లోపల అటువంటి అడ్డంకుల బ్రేకప్, డిస్‌రప్షన్ అనేది ఫలకం కలిగించే అంతరాయం నుంచి గాయాన్ని 'రిపేర్' చేయడానికి రక్తం గడ్డకట్టే విధానాలను ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.
డాక్టర్ రెడ్డి ప్రకారం ఇన్‌ఫ్లమేషన్ కలిగించే కారకాల వల్ల రక్తనాళాల లైనింగ్‌కు కలిగే గాయం కారణంగా కరోనరీ ధమనుల్లో ఫలకాలు ఏర్పడతాయి. రక్తంలో ప్రసరించే కొవ్వులు గాయపడిన ప్రదేశంలో ఫలకం పెరగడానికి జమ అవుతాయి. అధిక రక్తపోటు, ధూమపానం, మధుమేహం, అనారోగ్యకర ఆహారాలు, ఒత్తిడి, నిద్రలేమి లేదా ఇన్ఫెక్షన్స వంటివే ఇన్‌ఫ్లమేషన్‌కు కారకాలుగా ఉన్నాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాల్లో ఆకస్మిక లేదా తీవ్రమైన పెరుగుదల ఉంటే దీర్ఘకాలికంగా గుండెపోటుకు దారితీసే ఫలకం చీలికను కూడా తీవ్రతరం చేస్తుందని డాక్టర్ రెడ్డి తెలిపారు.
వర్కవుట్స్ చేస్తుండగా గుండెపోటు మరణాలకు కారణం?
కఠినమైన శారీరక శ్రమ చేస్తున్నపుడు సడెన్ కార్డియాక్ డెత్ అనేది బ్లాకేజెస్ గుర్తించబడని సందర్భా్ల్లో, కొన్నిసార్లు తెలిసిన రోగనిర్ధారణ నేపథ్యంలో సంభవిస్తుంది. తీవ్రమైన వ్యాయామం కూడా ఫలకం(ప్లేక్) చీలికకు కారణమవుతుంది లేదా గుండెలో విద్యుత్ అవాంతరాలను ప్రేరేపిస్తుంది, ఇది కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుందని డాక్టర్ రెడ్డి చెప్పారు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి కోలుకున్న రోగి గుండె సాధారణంగా బలహీనంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి సమయంలో సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో పోలిస్తే ఇప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ విజిటింగ్ కన్సల్టెంట్ డాక్టర్ సుమన్ భండారి చెప్పారు.
అంటే దీని అర్థం వ్యాయామం గుండెకు చెడ్డదని కాదు. కరోనరీ ధమనుల్లో ఫలకాలను నిర్మించే, పగలగొట్టే ప్రమాద కారకాలను గుర్తించి నియంత్రించడం చాలా అవసరం. ఇతర జనాభా సమూహాల కంటే చిన్న వయసులో గుండెపోటు ఎదుర్కొనే జాతి గ్రహణశీలత గల భారతీయుల్లో దీనిపట్ల మరింత జాగ్రత్త అవసరమని డాక్టర్ రెడ్డి చెప్పారు.
రోగనిర్ధారణ పరీక్ష సాయపడగలదా?
ప్రమాదాన్ని పసిగట్టేందుకు మూడు విషయాలు : 'చిన్న ఫలకం ఉనికి; ఫలకం అంతరాయం సంభావ్యత, రక్తం గడ్డకట్టే తీవ్రత'ను గుర్తించాల్సిన అవసరం ఉంది. నమ్మకమైన నాన్-ఇన్వేసివ్ డయాగ్నస్టిక్ పరీక్షలు మొదటిదానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇందులోని ప్రతి విషయానికి సంబంధించిన పరీక్ష భవిష్యత్తులో ఎటువంటి హామీ ఇవ్వదు. ఎందుకంటే ఈ మూడు అంశాలు జీవనశైలి, పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి.