- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఆరోగ్యం అంతంతే.. రోగాలు వెంటాడినట్లే..
దిశ, ఫీచర్స్: మనం తీసుకునే శ్వాస శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే లైఫ్ లాంగ్ శ్వాస మీదనే జీవించే మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది నిర్ధారించుకోవడం ముఖ్యం. నోటి ద్వారా బ్రీతింగ్ తీసుకోవడం హెల్త్ పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుండగా.. ముక్కుతో శ్వాస పాజిటివ్ గా పనిచేస్తుంది. జీవితాన్ని మార్చేసే ప్రభావాలను కలిగి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.
1. మన ముక్కు వాస్తవానికి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆక్సిజన్ తీసుకోవడాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు నైట్రిక్ ఆక్సైడ్ వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది. అంటే ఇది రక్త నాళాలను విస్తృతం చేస్తుంది. ఈ విస్తృత రక్త నాళాలు మెరుగైన రక్త ప్రవాహాన్ని అనుమతిస్తాయి. శరీరం అంతటా ఎక్కువ ఆక్సిజన్ వ్యాపిస్తుంది.
2. ముక్కుతో తీసుకునే శ్వాస లోతైన, డయాఫ్రాగ్మాటిక్ శ్వాసను ప్రోత్సహిస్తుంది, ఇది మెరుగైన నాణ్యమైన నిద్రకు, విశ్రాంతికి దారితీస్తుంది. నాసికా గాలి ప్రవాహం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గురకను తగ్గిస్తుంది. మరింత ప్రశాంతమైన నైట్ స్లీప్ కు దోహదం చేస్తుంది.
3. మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు డీప్ బ్రెత్ తీసుకోవాలని చెప్తారు నిపుణులు. ఎందుకంటే ఇలా ముక్కు ద్వారా తీసుకునే శ్వాసతో.. బ్రెయిన్ కు రక్త ప్రవాహం పెరుగుతుంది. యాక్టివ్ అయిపోతుంది. అంతేకాదు మెమొరీ, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, సామర్థ్యం పెరుగుతాయి.
4. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రవాహాన్ని సాఫీగా మారుస్తుంది. దీని అర్థం గుండెపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. తక్కువ బీపీ అంటే మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని సంకేతం.
5. మీరు ఇక భరించలేను అనే పరిస్థితిని ఎదుర్కున్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి. దీనివల్ల పారాసింపథటిక్ నాడీ వ్యవస్థ సక్రియం అవుతుంది. బాడీ రెస్ట్ రెస్పాన్స్... ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది.
6. ముక్కు ఫిల్టర్‌గా పని చేస్తుంది. దుమ్ము, అలెర్జీ కారకాలు, వ్యాధికారకాలను ట్రాప్ చేస్తుంది. ముందుగా చెప్పినట్లు ముక్కు శ్వాస ఉత్పత్తి చేసే నైట్రిక్ ఆక్సైడ్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మరింత మద్దతు ఇస్తుంది.
7. ముక్కు ద్వారా తీసుకునే శ్వాస బాడీ వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేయడంలోనూ కీలక పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే ముక్కు శ్వాసతో ముడిపడి ఉన్న లోతైన, మరింత నియంత్రిత శ్వాస కడుపు ఫుల్ గా ఉందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఫుడ్ తీసుకోవడాన్ని తగ్గించేందుకు వీలు అవుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశం ఉండదు.
8. బాల్యంలో పిల్లలు ముక్కు ద్వారా తీసుకునే శ్వాస దవడ, ముఖ ఎముకల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
అయితే జలుబు కారణంగా ముక్కు పూర్తిగా మూసుకుపోయినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల బాడీలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కలిగే లాభాలను కోల్పోతాం. ముఖ్యంగా నోస్ బ్రీత్ గాలిని ఫిల్టర్ చేస్తుంది. నాసికా మార్గం గుండా వెళ్తున్నప్పుడు వేడిగా, తేమగా మారుస్తుంది. కానీ నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఈ ఫిల్టర్ జరగదు. పైగా ఇలా శ్వాస తీసుకోవడం వల్ల నోరు పొడిబారుతుంది. బ్యాడ్ స్మెల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాదు బ్రెయిన్ కు ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి అయోమయంగా, లేజీగా, అవిశ్రాంతంగా ఉంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. అలెర్జీ కారకాలు ఎక్స్ పోజ్ కావడాన్ని తగ్గించడం మంచిదని అంటున్నారు నిపుణులు. ఇది నాసికా రద్దీ, వాపును తగ్గిస్తుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది.