- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాదిగా ఆ తెగలో 'లెస్బియన్ వివాహాలు'.. వర్షం కోసమే!
దిశ, ఫీచర్స్ : 'స్వలింగ వివాహాలు' ఇప్పుడిప్పుడే సొసైటీ ఆమోదం పొందుతున్నాయి.కానీ కర్ణాటకలోని ఒక గిరిజన కమ్యూనిటీ మాత్రం చాలా ఏళ్లుగా దీన్నొక మతపరమైన నమ్మకంగా భావిస్తోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎప్పుడు? ఎలా? ప్రారంభమైందో ఈ తరానికి తెలియనప్పటికీ ఆ గిరిపుత్రులు మాత్రం కొన్ని తరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
కర్నాటక, ఉత్తర కన్నడ జిల్లాలో 'హలక్కీ ఒక్కలిగ' తెగకు చెందిన గిరిజనులు జీవిస్తుంటారు. వీరు ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగే ప్రత్యేకమైన వివాహాన్ని 'దడ్డువే మదువే'గా పిలుస్తారు. ఇద్దరూ చీరకట్టులోనే ముస్తాబైనా.. అందులో ఒకరు వధువు, మరొకరు వరుడిగా ఉంటారు. సాధారణ పెళ్లిలో బారాత్ మాదిరిగానే వీరికి కూడా ఊరేగింపు నిర్వహిస్తారు. ఆచారాలు పాటించడంతో పాటు కట్న కానుకలు కూడా అందజేస్తారు. ఇదే క్రమంలో సంగీత, నృత్య కార్యక్రమాలతో పాటు విందు కార్యక్రమం ఉంటుంది. ఇలా లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత పెద్దలందరూ కొత్త జంటను ఆశీర్వదిస్తారు. ఇటీవలే కర్ణాటకలోని కర్కివినాయక కరియమ్మ ఆలయంలో దడ్డువే మదువే వివాహం జరిగింది. హలక్కీ తెగలో ఈ దేవతలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వివాహంలో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. నూతన వధూవరుల మెడలో చిప్స్ ప్యాకెట్ల దండలు వేస్తారు.
ఎందుకోసం చేస్తారంటే?
వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇంద్రుడిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా ఇలా ఇద్దరు యువతులకు జంటగా వివాహం చేస్తారు. అంతేకాదు ఆ వర్షం అవసరం కంటే ఎక్కువ లేదా తక్కువగా కూడా కురవద్దని వాళ్లు దేవుళ్లను ప్రార్థిస్తుంటారని స్థానికులు తెలిపారు.
బెడ్‌పై హీరోయిన్ సెక్సీ పోజ్.. ఒక్కసారి చాన్స్ ఇమ్మంటున్న ఫ్యాన్స్