పోషకాలు నశించకుండా వంట చేయడంలో మెలకువలు నేర్చుకోండి..!

by Anjali |   ( Updated:2024-09-25 08:29:05.0  )
పోషకాలు నశించకుండా వంట చేయడంలో మెలకువలు నేర్చుకోండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టవ్ మీద వండడం వల్ల ఆహారాల్లో పలు రకాల పోషకాలు తగ్గిపోతాయని తాజాగా ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. కాగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పోషకాలు అందవని.. పాటించాల్సిన మెలకువలు తెలియజేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అయితే కొన్ని రకాల ఫుడ్స్ వాటర్ ‌లో ఉడకబెట్టుతుంటారు. అందుకు తక్కువ నీరు పోయాలి. వాటర్ తక్కువ ఉంటే తొందరగా ఇంకిపోతాయి. కాగా ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. విటమిన్లు, పోషకాలు పోవు.అలాగే కూరగాయలు ఎప్పుడైనా సరే తొక్క తీసి ఉడికించకండి. పీచు పదార్థాలు తింటే జీర్ణాశయంలోకి వెళ్లి అరగడానికి సహకరిస్తుంది.

అలాగే కూరగాయల్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసి వండాలి. చిన్న టమాటాలు, చిన్న ఆనియన్ కట్ చేయకుండానే వండాలి. వండిన ఫుడ్ ను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. దీంతో అందులోని పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. కూరగాయలను ఉడికించిన నీటిని ఎలాగోలా మీ ఆహారంలో భాగం చేసుకోండి. శరీరానికి పోషకాలు అందుతాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story