Leafy vegetables : వర్షాకాలంలో ఆకు కూరలు నిజంగానే తినకూడదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే

by Javid Pasha |   ( Updated:2024-08-25 12:06:23.0  )
Leafy vegetables : వర్షాకాలంలో ఆకు కూరలు నిజంగానే తినకూడదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే
X

దిశ, ఫీచర్స్ : ఆకుకూరల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయని, వాటిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ వర్షాకాలంలో తినకూడదని, దీనివల్ల అనారోగ్యాలు వస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇందులో నిజమెంత? అసలు తింటే ఏం జరుగుతుంది? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

* ఆకు కూరలవల్ల హెల్త్ రిస్క్ పెరుగుతుందనడంలో నిజం లేదు. కానీ.. వర్షాకాలంలో తినకూడదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో వర్షాలు, వరదల కారణంగా ఆకు కూరలపై బురద, మురుగు నీరు పేరుకుపోయే అవకాశం ఉండవచ్చు. అదే సందర్భంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకు కూరను కడిగినప్పుడు బురద పోయినప్పటికీ వివిధ వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఆకులపై ఉండే చాన్సెస్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు వాటిని సరిగ్గా కడగకుండా లేదా సరిగ్గా ఉడకకముందే తింటే అనారోగ్యాలు వస్తాయి. అంతే తప్ప సాధారణంగా ఇంకెలాంటి సమస్యలు రావు.

* ఆకుకూరలపై నిలిచిపోయే వైరస్‌లు, బ్యాక్టీరియాలకు గురైతే ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టమక్ పెయిన్, డయేరియా, జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలు వంటివి వస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే సరైన శుభ్రత పాటించనప్పుడు, ఆకూకూరలను సరిగ్గా వండనప్పుడు మాత్రమే అలా జరగవచ్చు. శుభ్రంగా కడిగి, పూర్తిగా ఉడికే దాకా వండి తినడంవల్ల ప్రాబ్లం ఉండదు. కాపోతే ఎంతకైనా మంచిదని కొందరు వానాకాలంలో ఆకు కూరలు తినకూడదని చెప్తుంటారు.

* వానాకాలంలో ఆకు కూరలు తిన్నా ఎలాంటి సమస్యలు రాకూడదంటే తగిన పరిశుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా వాటిని శుభ్రంగా కడగాలని, తర్వాత పొడి వాతావరణంలో తేమ పోయేదాకా ఆరబెట్టాలని సూచిస్తున్నారు. ఇక వండటానికి ముందు గోరు వెచ్చని ఉప్పువేసిన నీటితో కూడా ఒకసారి లైట్‌గా కడగడం వల్ల ఆకు కూరలపై ఉండే హానికారక బ్యాక్టీరియాలు నశిస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో తిన్నప్పటికీ ఎలాంటి రిస్క్ ఉండదు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed