Study - Success : లేట్ నైట్ స్టడీ.. స్టూడెంట్స్‌కు మంచిదేనా?

by Sujitha Rachapalli |
Study - Success : లేట్ నైట్ స్టడీ.. స్టూడెంట్స్‌కు మంచిదేనా?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చాలా మంది విద్యార్థులు పగటి పూట చదివేటప్పుడు కాన్సంట్రేట్ చేయలేరు. ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణం కాగా సులభంగా చదువుపై దృష్టి సారించేందుకు రాత్రి పూట మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యేందుకు మంచి బెస్ట్ ఆప్షన్ అని సూచిస్తున్న వారు.. నైట్ స్టడీ సక్సెస్ మంత్రగా ఎందుకు మారుతుందో మరిన్ని కారణాలు వివరిస్తున్నారు.

ది మిడ్ నైట్ మైండ్

క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ నైట్ టైంలో పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు విద్యార్థుల బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుంది. క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు.

మార్నింగ్ రష్

ఉదయాన్నే లేచి పక్షుల్లా పరుగెత్తడానికి బదులుగా.. నైట్ ఓల్స్ మాదిరిగా మారి పీస్ ఫుల్ గా ఉండొచ్చు. మరింత రిలాక్సింగ్ గా రోజును ప్రారంభించవచ్చు.

పర్సనలైజ్డ్ స్టడీ స్పేస్

లేట్ నైట్ స్టడీ సెషన్స్ తరుచుగా పర్సనలైజ్డ్ గా పరిగణించబడుతాయి. సాప్ట్ లైటింగ్, ఫేవరేట్ మ్యూజిక్, క్రేజీ బ్లాంకెట్స్ మీ మూడ్ ను బూస్ట్ చేయగలవు.

తగ్గుతున్న సోషల్ డిస్ ట్రాక్షన్స్

సోషల్ మీడియా, ఫ్రెండ్స్ పగటి పూట మిమ్మల్ని చదవకుండా చేయొచ్చు. రాత్రి సోషల్ ప్రెజర్ తగ్గొచ్చు. ఈ కారణం వల్ల కూడా నైట్ టైం స్టడీపై కాన్సంట్రేట్ చేసేందుకు అవకాశం ఉంది.

బ్రెయిన్ వేక్ అప్

లేట్ నైట్ బ్రయిన్ వేక్ అప్ సైకిల్ కాన్సంట్రేషన్ కు మరో కారణం అంటున్నారు నిపుణులు. అంతేకాదు రాత్రిపూట చదువు యూనిక్ పర్స్ పెక్టివ్ కలిగి ఉంటుంది. పగలు కన్నా బెటర్ కనెక్షన్స్, పాటర్న్ చూడగలమని చెప్తున్నారు.

పర్సనల్ సాటిస్ ఫాక్షన్

రాత్రిపూట చదువు వ్యక్తిగత సంతృప్తిని ఇస్తుంది. ఏదో సాధించామనే భావం కలుగుతుంది. ఈ టైంలో పెట్టిన ఎక్స్ ట్రా ఎఫర్ట్ కాన్ఫిడెన్స్, మూడ్ బూస్ట్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed