Ladies Finger : బెండకాయలో ఆ పోషకాలు ఫుల్.. డయాబెటిక్ పేషెంట్లు తింటే అద్భుతమే!

by Javid Pasha |
Ladies Finger : బెండకాయలో ఆ పోషకాలు ఫుల్.. డయాబెటిక్ పేషెంట్లు తింటే అద్భుతమే!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి వాటిలో బెండకాయ కూడా ఒకటి. అన్ని సీజన్లలో లభించే ఈ ఆకుపచ్చని కాయగూరలో పోషకాలు ఫుల్లుగా ఉంటాయని, డయాబెటిక్ పేషెంట్లు తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని చెప్తుంటారు. దీంతో పాటు ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

* బెండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, కె, బి6 ఉండటంవల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఎల్‌డీఎల్ ఫైబర్ కలిగి ఉన్నందున శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, తద్వారా గుండె జబ్బుల నివారణలో సహాయపడుతుంది. పీచు పదార్థంవల్ల రక్తంలో చక్కెరస్థాయిలు కంట్రోల్లో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే డయాబెటిక్ పేషెంట్లు తినడం మంచిదని చెప్తుంటారు.

* పీచు పదార్థం తగిన మోతాదులో ఉండటంవల్ల బెండకాయను తరచుగా తీసుకునే వారిలో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వివిధ కారణాలవల్ల శరీరంలోని కణాలకు సంభవించే నష్టాన్ని నివారిస్తాయి.

*తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్ మూలంగా బెండకాయను తినడం అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ కె, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మంచివి. అంతేకాకుండా ఇందులోని ఫోలేట్ గర్భవతులకు చాలా ముఖ్యమైన పోషకం. పిండం ఎదుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెప్తారు.

* పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కలిగి ఉన్నందున డయాబెటిక్ బాధితులకు రక్తంలో చక్కెర శోషణను స్లో డౌన్ చేస్తుంది. కాబట్టి బెండకాయ తినడంవల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయని, మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెప్తు్న్నారు. అధిక మొత్తంలో విటమిన్ ఎ కూడా ఉండటంవల్ల కంటి ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులోని కె విటమిన్ బోలు ఎముకల సమస్యను నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలు కూడా కలిగి ఉన్నందున బెండకాయను తినడం అందానికి, ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story