- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొరోరా పెంగ్విన్‌ల కనుమరుగు.. వాతావరణ మార్పులతో తగ్గుతున్న సంఖ్య
దిశ, ఫీచర్స్: సముద్రాలే ఆవాసంగా జీవించే పెంగ్విన్ గురించి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కొరోరా పెంగ్విన్ జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయని, గతం కంటే వాటి సంఖ్య తగ్గిందని మాస్సే యూనివర్సిటీ న్యూజిలాండ్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా వీరు నార్త్ ఐలాండ్‌లో గల సౌత్ ఏరియాలో పెంగ్విన్ జాతులను కొన్నేండ్ల నుంచి పరిశీలిస్తూ వస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కొరోరా పెంగ్విన్‌ల సంఖ్య తగ్గుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పులు, హీట్‌వేవ్, సముద్ర తీరాల్లో పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఇటీవల కొన్ని సముద్ర తీరాల్లో కొరోరా పెంగ్విన్‌ల అవశేషాలను కూడా వారు కనుగొన్నారు.
దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పురాతన అవక్షేపాలలో అంతరించిపోయిన కొరోరా పెంగ్విన్ జాతులను తాము గుర్తించినట్లు పరిశోధకుల్లో ఒకరైన కార్ల్ రౌబెన్ హైమర్ పేర్కొన్నాడు. కాగా తాము గుర్తించిన శిలాజాలు అరుదైన పెంగ్విన్ జాతికి చెందినవి వెల్లడించాడు. అయితే ఈ పరిశోధనలు అంతరించిపోతున్న పెంగ్విన్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని అందించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్ని రకాల పెంగ్విన్‌లను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, పర్యావరణ సమతుల్యతలో అవి కూడా తమవంతు పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ కొన్ని రకాల అరుదైన పెంగ్విన్ జాతులు, వాటి ఉపజాతులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సముద్ర ప్రాంతాల్లో మనుగడ సాగిస్తున్నాయి.