Japanese workouts : కొవ్వును కరిగించే జపనీస్ వ్యాయామాలు.. ఇలా చేస్తే పొట్ట తగ్గడం ఖాయం!

by Javid Pasha |   ( Updated:2024-12-18 14:51:44.0  )
Japanese workouts : కొవ్వును కరిగించే జపనీస్ వ్యాయామాలు.. ఇలా చేస్తే పొట్ట తగ్గడం ఖాయం!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సరైన ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి. అయితే ఇందులోనూ పలు రకాలు ఉంటాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్ డోర్ వర్కౌట్స్‌తో పాటు ఇతర సాధారణ వ్యాయామాలు ఉంటాయి. ఒక్కో రకమైన వ్యాయామం ఒక్కో విధమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. కాగా ఇటీవల జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి పలు సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, పొట్ట పెరగడం వంటి ప్రాబ్లమ్స్ పలువురు ఫేస్ చేస్తున్నారు. అయితే కొన్ని జపనీస్ వ్యాయామాలు దీనికి చక్కటి పరిష్కారం చూపుతాయి. అవేంటో చూద్దాం.

రేడియో టైసో..

చాలా మంది వర్కౌట్లను రొటీన్‌తో స్టార్ట్ చేస్తారు. కానీ జపనీయులు మాత్రం ‘రేడియో టైసో’ అనే ప్రత్యేక వ్యాయామాలతో ప్రారంభిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ.. శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఒక విధంగా భారతీయ యోగాసనాలతో పోలి ఉంటాయని చెప్తారు. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి.

ఆడుతూ పాడుతూ ‘హూలాహూప్’

ఎక్సర్‌‌సైజ్ అంటేనే కొందరికి నీరసం వచ్చేస్తుంది. కానీ జపనీయులు చేసే ‘హూలాహూప్’ వ్యాయామంలో మాత్రం అలా కాదు. నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి దీనిని కొనసాగిస్తారు. ఇది సరదా ఆటలా ఉంటుంది. ఈ వర్కౌవుట్ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆయా భాగాలు నాజూగ్గా మారుతాయి. కాళ్లు, చేతులు, కోర్ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా ఫ్యాట్ కరిగి నాజూగ్గా మారుతారు.

సీజా సిటప్స్.. బెనిఫిట్స్

నేలపై వెల్లకిలా పడుకొని ముందుకు లేవడం, తిరిగి యథా స్థితికి రావడం.. వంటి భిన్నమైన యాంగిల్స్‌లో చేసే జపనీస్ వ్యాయామమే ‘Seiza సిటప్స్’. అంటే ఒక మోకాలిని మడిచి.. మరో మోకాలిని నేలపై చాచి ఈ ఎక్సర్‌సైజ్ కంటిన్యూ చేస్తారు. మరికొందరు రెండు మోకాళ్లని మడిచి కూర్చొని, విభిన్న భంగిమల్లో ప్రయత్నిస్తారు. ఇలా మొత్తం బాడీని బ్యాలెన్స్ చేసే క్రమంలో పొట్ట కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా ఫ్యాట్ తగ్గుతుంది. వీటితోపాటు బెల్లీ డ్యాన్స్, సల్సా, జుంబా వంటి డ్యాన్సులు కూడా పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడేవే. ఇండియన్ కల్చర్‌లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భరత నాట్యం కూడా అధిక బరువను, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed