- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రామెన్' సూప్ విత్ ఐస్‌క్రీమ్! నెట్టింట్లో నోరూరుతోంది!!
దిశ, వెబ్‌డెస్క్ః 'బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. అందులోనూ ప్రపంచంలో సామాజిక మాధ్యమాల వ్యాప్తి తర్వాత చిత్రవిచిత్రాలు లెక్కలేనన్ని మొదలయ్యాయి. అయితే, ఎంత సృజనాత్మకత ఉట్టిపడినా అవి ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి కూడా.. అలాగని, ఈ డిజిటల్ కాలంలో 'ఇది టాప్, ఇది వేస్ట్' అని దేన్నీ జర్నలైజ్ కూడా చేయడం కుదరదు మరి. ఈ క్రమంలో ఇంటర్నెట్లో విచిత్రమైన ఆహారపదార్థాలు వైరల్ అవుతున్న ట్రెండ్ మరింత పెరిగింది. ఫుడ్ బ్లాగర్లు కొందరు అసాధారణ వంటకాలను సృష్టించి, సరికొత్త టేస్ట్‌లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు, జపాన్‌లోని ఒసాకా నగరంలో ఓ సరికొత్త టేస్ట్‌తో తయారుచేసిన ఐస్‌క్రీమ్ రామెన్ సూప్ వీడియో వైరల్ అయ్యింది. ఫ్రాంకెన్ రెస్టారెంట్లో అందిస్తున్నఈ వంటకాన్ని 'స్వీట్ అండ్ స్పైసీ మిసో రామెన్' అని పిలుస్తున్నారు. ఈ వైరల్ వీడియోను బ్లాగర్ జెస్సీ ఓగుండిరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీనికి 3 మిలియన్లకు పైగా వ్యూవ్స్, 150k లైక్‌లను సంపాదించింది. విభిన్న స్పందనలు వస్తున్న ఈ టేస్ట్‌ను మీరూ ట్రై చేస్తారా..?! అయితే చూడండి.