- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Contra dating : ఆలోచనలు వేరైనా కలిసి బతకడమే ముఖ్యం.. ‘కాంట్రా డేటింగ్’పై యువతలో పెరుగుతున్న ఆసక్తి!
దిశ, ఫీచర్స్ : ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయనో, అభిప్రాయాలు కలవ లేదనో విడిపోయే జంటల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి మెంటాలిటీ నచ్చలేదనో, తనకు అనుగుణంగా నడుచుకోవడం లేదనో వెంటనే డివోర్స్ చెప్పేస్తున్నవారూ లేకపోలేదు. అయితే పర్మినెంట్ రిలేషన్‌షిప్ కోరుకునే వారికి ఇదొక పెద్ద సమస్యగా మారుతోది అంటున్నారు నిపుణులు. అయితే దీనికి చెక్‌పెట్టే ఓ సరి కొత్త పద్ధతి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అదే ‘కాంట్రా డేటింగ్’. భిన్నమైన ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవ భావంతో కలిసి మెలిసి జీవించడమే దీని ముఖ్య ఉంద్దేశంగా పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం.
ఎంత మంచి సంబంధమైనా ఎదుటి వ్యక్తికి పూర్తిగా నచ్చేలా నడుచుకోవడమంటే సాధ్య పడకపోవచ్చు అంటున్నారు ఈకాలం యువతీ యువకులు. పైగా ప్రతి విషయంలోనూ భార్యకు నచ్చేలా భర్త, భర్తకు నచ్చే విధంగా భార్య నడుచుకోవడం ఇప్పుడు అవసరం లేదంటున్నారు కొందరు. ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు, వ్యక్తిగత భావాలు, ఉద్యోగం, కెరీర్, సంస్కృతి, సంప్రదాయం వంటి విషయాల్లో భిన్నత్వం ఉన్నా, ఆలోచనలు, ఆచరణ వేరైనా ఎవరికి నచ్చినట్లు వారు ఉంటూ.. జీవితాంతం కలిసి ఉండే లైఫ్‌స్టైల్‌పై ఇటీవల ఆసక్తి పెరుగుతోందని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. దీనినే ‘కాంట్రా డేటింగ్ ట్రెండ్’గా పేర్కొంటున్నారు.
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు..
మ్యారేజ్ చేసుకోవడానికి లేదా ఒక వ్యక్తిని ప్రేమించడానికి ముందు ఏం ఆలోచిస్తారు? నిన్నమొన్నటి వరకైతే అవతలి వ్యక్తి అభిప్రాయాలు, ఆలోచనలు తమకు అనుగుణంగా ఉన్నాయో లేదోనని చూసేవారు చాలా మంది. యుతలో, పెద్దల్లో కూడా ఇదే ఓపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు మారుతోంది. అలాంటి స్థిరమైన ఆలోచనలతో ఉంటే సంబంధాలు కలువడం, పెళ్లిళ్లు జరగడం ఇక నుంచి కష్టం కావచ్చు అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాంట్రా డేటింగ్’ ట్రెండ్ చాలామందిని ఆకట్టుకుంటోంది. భిన్నాభిప్రాయాలున్నా జంటలకు చక్కటి అవకాశంగా కనిపిస్తోంది. అంటే గతకాలపు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే ఈతరం ఆలోచనే ఈ కొత్త ట్రెండ్.
ఆధిపత్య ధోరణికి చెక్
పార్ట్‌నర్ తమకు నచ్చినట్లు నడుచుకోవడం, తాము చెప్పిందే వినాలనుకోవడం అనే పద్ధతికి అంగీకరిస్తే అది కొంతకాలమే బాగుంటుందిని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత సంబంధంలో ఆధిపత్య ధోరణికి దారితీస్తుందని చెప్తున్నారు. చివరకు ఇది విడాకులకు దారితీయవచ్చు. అయితే ముందుగానే ఒక క్లారిటీతో జీవిత భాగస్వామిని ఎంచుకునే కాంట్రా డేటింగ్ సంబంధంతో అలాంటి పరిస్థితి రాదు. ఆలోచనలు, అభిరుచులు వేరైనా ఎవరి పరిధుల్లో వారు ఉంటూనే.. జీవితాంతం కలిసి ఉండే ఈ సరికొత్త రిలేషన్‌షిప్‌లో ఫ్రీడమ్ ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పైగా ఇది అన్యోన్యతను పెంచుతుందని చెప్తున్నారు.
మారుతున్న ఆలోచన
సంబంధాల విషయంలో ఎంత సేపూ కంఫర్ట్ జోన్‌లో ఉండాలనుకోవడం ఆధునిక కాలంలో సమస్యలకు దారితీస్తోందని పలువురు పేర్కొంటున్నారు. భిన్నాభిప్రాయలున్నా కలిసి బతకాలన్న కాంట్రా ‘డేటింగ్ ట్రెండ్’ దానికి పూర్తి భిన్నమని చెప్తున్నారు. భిన్నమైన ఆలోచనలు, భిన్న రంగాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు వంటివి ఉన్నవారిని భాగస్వామిగా ఎంచుకోవడంవల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చునని, సమాజంలో పాతుకుపోయిన స్థిరమైన భావాలకు స్వస్థి పలకవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అలాగని ఇక్కడ ఎవరు కూడా ఇతర వ్యక్తుల ఇష్టాయిష్టాలను, మూలాలను, నైతిక విలువలను, సంప్రదాయాలను వ్యతిరేకించరు. కాకపోతే తాము పాటించాలా వద్దా అనే విషయంలో మాత్రం ఇతరుల జోక్యం అవసరం లేదంటోంది న్యూ జనరేషన్.
పరస్పర గౌరవం
మనసుకు నచ్చితే చాలు.. భాగస్వామి వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలతో సంబంధం లేదంటున్న కాంట్రా డేటింగ్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే పలువురిని ఆకట్టుకుంటోంది. మరో విషయం ఏంటంటే ఇక్కడ వయస్సు కూడా పెద్దగా పట్టింపులేనిదిగానే భావిస్తారు. అంటే అవతలి వ్యక్తి నచ్చితే తమకంటే చిన్నవారైనా, పెద్ద వయస్సు ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. పరస్పర గౌరవ భావంతో జీవితాంతం కలిసుంటే చాలనేదే ఈ కొత్త ధోరణి అనుసరించే వారి ఆలోచనగా ఉంటోంది.
ప్రయోజనాలు ఎన్నో..
ఒకే విధమైన ఆలోచన ఉండేవారితో పోల్చితే భిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులను లైఫ్ పార్ట్‌నర్ ఎంచుకుంటే దాంపత్య జీవితంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చాలా విషయాల్లో ఇక్కడ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటూ రిలేషన్‌షిప్‌లో కొనసాగడమే ప్రధానం. ఒక బంధం బలపడాలంటే కలిసి గడిపే క్షణాలు, సమయం ముఖ్యం. కానీ వ్యక్తిగత ఆసక్తుల గురించి పోట్లాడుకొని విడిపోవడం కాదంటున్నారు కాంట్రా డేటింగ్ రిలేషన్‌షిప్ సమర్థించే నిపుణులు, జంటలు. పైగా భిన్న ఆలోచనలు, భిన్న నేపథ్యాల కారణంగా అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆధిపత్య ధోరణికి అస్సలు అవకాశం ఉండదు.