ఆడపిల్లలకు 16 ఏళ్లుదాటినా రజస్వల కాకపోవడం ప్రమాదకర సమస్యేనా?

by Jakkula Samataha |
ఆడపిల్లలకు 16 ఏళ్లుదాటినా రజస్వల కాకపోవడం ప్రమాదకర సమస్యేనా?
X

దిశ, ఫీచర్స్ : అమ్మాయిల్లో రజస్వల కావడం సహజం. వారి కూతురికి 12 ఏళ్లు వచ్చినప్పటి నుంచి తల్లి కూతురు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కూతురు ఎప్పుడు రజస్వల అవుతుందో అని ఎదురుచూస్తూ ఉంటుంది. సరైన సమయంలో రజస్వల కావడం అనేది ఆడపిల్లల ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఇక మొదటి సారి పీరియడ్స్ అనేది కాస్త భయాందోళనలను పెంచుతుంది.తొమ్మిది రోజుల పాటు ఒంటరిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఒకే గదిలో ఉంచుతారు. అలాంటి పరిస్థితుల్లో మానసిక వేదనకు గురవుతుంటారు.

అయితే కొన్ని రోజుల క్రితం ఆడపిల్లలకు 16 ఏళ్లు వచ్చాక రజస్వల అయ్యేది. కానీ ఇప్పటి పిల్లల్లో 10 ఏళ్లు దాటగానే, మొదటి పీరియడ్ వస్తుంది.కానీ కొంత మందికి మాత్రం 16 ఏళ్ల వయసు దాటిన మొదటి పీరియడ్ రాదు. దీంతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక టెన్షన్ పడిపోతుంటారు. మరి కొందరమో, మెల్లిగా అవుతుంది లే అని లైట్ తీసుకుంటారు.

కాగా, దీని గురించి వైద్యులు మాట్లాడుతూ.. రజస్వల రావడం సహజం. ఇది ఆడపిల్లలకు సరైన సమయంలో రావాలి, ఏజ్ దాటిపోతున్నా, రజస్వల కాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు తెలుపుతున్నారు . అయితే ఇలా పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం ఉన్నదంట. అది టర్నర్ సిండ్రోమ్. ఇది కొంతమంది మహిళల్లో ఉండే వ్యాధి. సాధారణంగా మహిళల్లో XX అని రెండు క్రోమోజోములు ఉంటాయి. అయితే టర్నర్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో మాత్రం రెండు X క్రోమోజోములు బదులుగా ఒకే ఒక్క X క్రోమోజోమ్ ఉంటుంది. దీని వల్ల వారి శారీరక పెరుగుదల సరిగా ఉండదు. హార్మోనల్ సమస్యలు ఉంటాయి. దీనివల్ల పీరియడ్స్ రాకపోవడం వచ్చినా చాలా ఆలస్యంగా రావడం జరుగుతుందంట. ఇదే కాకుండా కొంత మందిలో హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, జన్యుపరమైన సమస్యల వలన, గర్భాశయ సమస్యల వలన కొంత మందిలో మొదటి పీరియడ్స్ ఆలస్యం అవుతుందని వారు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed