తల్లిదండ్రులను కలవరపెడుతున్న పిల్లల ఫ్రెండ్షిప్.. నిపుణులు చెప్పేది ఇదే..

by sudharani |   ( Updated:2023-10-31 06:47:19.0  )
తల్లిదండ్రులను కలవరపెడుతున్న పిల్లల ఫ్రెండ్షిప్.. నిపుణులు చెప్పేది ఇదే..
X

దిశ, ఫీచర్స్: మీ పిల్లలు ఫ్రెండ్స్‌ను ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? సోషల్ రిలేషన్స్ డెవలప్ చేసుకునేందుకు సవాళ్లు ఎదుర్కొంటున్నారా? ఈ విషయం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచన పెరుగుతుంది. కానీ అంతకు ముందు అసలు పిల్లలు ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. మనుషులు స్వతహాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఇంట్రోవర్ట్, ఎక్స్ ట్రోవర్ట్ అనే వాళ్లు ఉండరని అంటున్న నిపుణులు.. ఈ సమయంలో పిల్లలను సాధారణం చేసేందుకు తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి? చిన్నారుల్లో సామర్థ్యాన్ని ఎలా పెంపొందించాలి? అనే విషయంపై సలహాలు ఇస్తున్నారు.

పేరెంట్స్ పాత్ర: తల్లిదండ్రులు సిగ్గుపడేవారు లేదా ఇంట్రోవర్ట్ అయితే... వారి పిల్లలు ఈ లక్షణాలను ఫాలో అయిపోతారు. తమను తాము మరింత రిజర్వ్‌గా మార్చుకుంటారు. ఇక అమ్మానాన్న మితిమీరిన ఒత్తిడిని కలిగి ఉంటే.. స్నేహితులను సంపాదించడానికి పిల్లలను ఫోర్స్ చేయవచ్చు. ఇది పిల్లల్లో ఆందోళన కలిగించవచ్చు.

సిగ్గు: పిరికి లేదా ఇంట్రోవర్ట్ అని సెపరేట్ పిల్లలు ఉండరు. ఇలా లేబుల్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ చేస్తే ఆ విధంగానే ప్రవర్తించే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు సహజంగానే ఇతరుల కంటే ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటారు. ఇది తోటివారితో కలిసిపోవడాన్ని కష్టతరం చేస్తుంది.

సామాజిక ఆందోళన: పిల్లలు, పెద్దలు, సామాజిక ఆందోళనను అనుభవించవచ్చు. ఇంట్లో తరచుగా జరిగే గొడవలు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవచ్చు. దీంతో చిన్నారులు విశ్రాంతి పొందడం, సామాజిక నైపుణ్యాలు పెంపొందడం సవాలుగా మారుతుంది. సోషల్ యాంగ్జయిటీ చెందే ముందు.. పిల్లవాడు ఇంట్లో కూడా ఆందోళన చెందుతున్నాడో లేదో చూడండి.

సామాజిక నైపుణ్యాలు లేకపోవడం : సోషల్ స్కిల్స్ పెంపొందించడానికి మొదటి అడుగు సమర్థవంతమైన సంభాషణ. ఇంట్లో కన్సవర్జేషన్, భావవ్యక్తీకరణ లేకపోవడం, తల్లిదండ్రులు, తోటివారు, ఉపాధ్యాయులచే విమర్శించబడటం.. పిల్లల్లో ఒంటరితనాన్ని కలిగిస్తుంది. కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడం కష్టం అవుతుంది.

ప్రత్యేక ఆసక్తులు: ప్రతి బిడ్డ ఒకేలా ఉండరు. అందరికీ ప్రత్యేకమైన అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. సేమ్ హ్యాబిట్స్, ఇంట్రెస్ట్ ఇతర పిల్లల్లో లేకపోవచ్చు. కానీ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న చిన్నారులను కనుగొంటే.. నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది.

విమర్శ-పోలిక: తోటివారితో గతంలో జరిగిన ప్రతికూల లేదా బెదిరింపు సంఘటన కొత్త స్నేహాలను ఏర్పరుచుకోవడంలో పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఇన్సిడెంట్ మళ్లీ రిపీట్ అవుతుందని భయపడతారు. అందుకే తోటివారితో మెరుగైన సంభాషణ, స్నేహం పొందలేరు.

పేరెంట్స్ ఏం చేయాలి?

* పిల్లలతో ఓపెన్ అండ్ సేఫ్ కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవాలి.

* సానుభూతితో కూడిన కరుణను బోధించాలి.

* గ్రూప్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా చేయాలి.

* షేరింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి సోషల్ స్కిల్స్ డెవలప్ చేసేందుకు ప్రయత్నించాలి.

* మీ పార్టనర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హెల్తీ రిలేషన్స్ గురించి తెలుసుకునేలా చేయాలి.

* పరిస్థితి అదుపుతప్పుతుందని అనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి

* చిన్న చిన్న విజయాలను కూడా మీ చైల్డ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. వారి ఎఫర్ట్ గుర్తించి.. రివార్డ్స్ అందించండి.

Advertisement

Next Story

Most Viewed