- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిపై నిషేధమే పరిష్కారమా?
దిశ, ఫీచర్స్: కర్నాటక రాష్ర్టానికి చెందిన డ్రగ్స్ కంట్రోల్ డిపార్టుమెంట్ మైనర్లకు కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు అమ్మరాదని ఫార్మాసిస్టులకు ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని నెలల కిందట బెంగుళూరులోని ఒక పాఠశాలలో సాధారణ పర్యవేక్షణలో భాగంగా స్కూల్ అసోసియేషన్ సభ్యులు స్టూడెంట్స్ బ్యాగులు చెక్ చేశారు. ఈ సందర్భంగా 8, 9, 10 తరగతులు చదువుతున్న పలువురు విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, నోటి ద్వారా వేసుకునే గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, వైట్‌నర్స్ లభించాయి. ఈ ఘటన నేపథ్యంలోనే అక్కడి డ్రగ్స్ కంట్రో డిపార్టుమెంట్ వాటిని నిషేధించే చర్యలు తీసుకుంది. కానీ ఈ విధంగా నిషేధం విధించడంవల్ల ఫలితం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల్లో అవగాహన కోసం సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశ పెట్టాలనే చర్చ ఒకవైపు జరుగుతుండగా, మరో వైపు కండోమ్స్, గర్భ నిరోధాకాలను బ్యాన్ చేయడం అనేది సమస్యకు పరిష్కారం ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పోర్న్ సంగతేంటి?
ఒక విధంగా ఆలోచించినప్పుడు చదువుకునే రోజుల్లో అందరూ అలాంటి ఆలోచనలను కలిగి ఉండి బయటపడినవారే. ఈ జనరేషన్‌లో మొబైల్, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. ఏ విషయమైనా అందులో దొరుకుతుంది. పోర్న్ వీడియోలు కోకొల్లలు. వాటిని టీనేజర్స్ చూస్తుంటారు కూడా. మరి వీటివల్ల ఆలోచనలు కలుషితం అవడాన్ని ఆపగలమా? అది సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు కర్నాటక డ్రగ్స్ అండ్ కంట్రోల్ డిపార్టుమెంట్ విధించిన నిషేధం ఎలా సమంజసం అవుతుంది? అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మొబైల్స్, ఇంటర్నెట్‌లలో సెక్స్ సంబంధిత, సమాచారం పోర్నోగ్రఫీ అందుబాటులో ఉన్నప్పుడు కలుగని ప్రమాదం, కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు అమ్మితే కలుగుతుందా? అంటే 'నిషేధిత' ఆలోచనే ఆక్సెప్ట్ చేయలేం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
18 ఏండ్లలోపే ఆ అనుభవం !
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 39 శాతం మంది మహిళలు 18 ఏండ్లలోపలే తాము సెక్స్ కోరికలు తీర్చుకున్నామని తెలిపారు.10 శాతం మంది మహిళలు మాత్రం తాము 15 ఏళ్లలోపు వయస్సులోనే ఆ అనుభవాన్ని ఆస్వాదించామని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే సెక్స్ పరమైన ఆలోచనల నుంచి, ఆచరణ నుంచి యువతను నిజంగా కంట్రోల్ చేయగలమా? అనే అనుమానతం కలుగుతుంది. టీనేజర్స్‌ను ఇలాంటి విషయాల్లో ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే వారు అంత అపోజిట్ పనులు చేస్తారు. తిరుగుబోతులుగా మారుతారు. ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
బాల్య వివాహాలను ఎందుకు పట్టించుకోరు?
టీనేజిలోనే పెళ్లి చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు మనదేశంలో చాలా జరుగుతున్నాయి. ఇంగ్లిష్ దినప్రతిక 'ది హిందు'లో పబ్లిషైన ఒక ఆర్టికల్ ప్రకారం బిహార్‌లో నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా టీనేజర్స్‌లో 19 శాతం మంది గర్భం దాల్చుతున్నారు. ఇక దేశంలోని 44 జిల్లాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం 44 శాతం మందికి 18 ఏండ్లలోపునే పెళ్లిళ్లు కావడం, గర్భం దాల్చడం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గర్భనిరోధక సాధనాలైన కండోమ్స్, మాత్రలు వంటివితక్కువగా ఉపయోగించడం కూడాను.
సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశ పెట్టాలి
మైనర్లకు కండోమ్స్, గర్భ నిరోధకాలు అమ్మకూడదనే నిషేధం గురించి సమస్యకు పరిష్కారం అనుకుంటే.. మరి బాల్య వివాహాలపై దేశ వ్యాప్తంగా నిషేధం ఉండగా అవి ఎలా జరుగుతున్నాయి? ఎందుకు అరికట్టలేకపోయామని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీనేజీలో సెక్స్‌పట్ల ఆసక్తి కలగడం సహజం. నేడు చాలా వరకు OTT ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరగడంతో లైంగిక ఆలోచనల పరిధి పెరిగింది. ఎందుకంటే అవి టీనేజర్స్‌లో సెక్స్ ఆలోచనలు రేకెత్తించే అనేక కార్యక్రమాలు ప్రసారం చేస్తు్న్నాయి. సెక్స్ చేస్తున్నట్టు అనేక సన్నివేశాలు చూపుతాయి. వీటి గురించి పట్టించుకోరు కానీ కండోమ్స్ నిషేధిండంపైనే ఎందుకు ఫోకస్. ఒకవేళ కండోమ్‌లు, గర్భనిరోధకాలు అందుబాటులో లేకపోతే, వాటిని నిషేధిస్తే టీనేజర్స్ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనరనే గ్యారెంటీ లేదు కదా. గర్భనిరోధకాలు వాడకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అబ్బాయిలకంటే ఎక్కువగా అమ్మాయిలు సామాజిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మైనర్లలో లైంగిక చర్యలవల్ల గర్భధారణ సంభవించినప్పుడు, లేదా ఆరోగ్య పరమైన సమస్యలకు చట్టపరమైన భద్రత, రక్షణ లేవు. టీనేజర్స్ లోని సెక్స్ ఆలోచనలను తప్పు పట్టలేం. అది పెద్ద సమస్య కూడా కాదు. అలాగే 18 ఏండ్లలోపు మైనర్లు సెక్సులో పాల్గొనవచ్చని ప్రోత్సహించాల్సిన అవసరమూ లేదు. ఇక టీనేజర్స్‌లోని లైంగిక పరమైన ఆలోచనలను కూడా ఆపడం సాధ్యం కాదు. అందుకే అవగాహన పెంపొందించేసెక్స్ ఎడ్యుకేషన్‌ను పాటశాలల్లో ప్రవేశ పెట్టడం అన్నింటికంటే బెటర్ సొల్యూషన్ అని చెప్పవచ్చు.