- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంధంలో బ్రేక్.. కమ్యూనికేషన్ తగ్గిపోతే దూరమయ్యే అవకాశం
దిశ, ఫీచర్స్: రిలేషన్‌షిప్‌లో ఉన్న లవర్స్ ‘ఐ వాంట్ ఏ బ్రేక్’ అని చెప్పుకోవడం కామన్ అయిపోయింది. ఈ మాట ‘బ్రేకప్’ కన్నా తక్కువ సీరియస్‌నెస్‌తో కూడినదే అయినా గొడవ కంటే మాత్రం పెద్దదే అంటున్నారు నిపుణులు. ఇలా బ్రేక్ తీసుకోవడం అనేది పర్సనల్ స్పేస్ కోసం డిమాండ్ చేసినట్లుగా అనిపించినా.. లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. ఈ సమయంలో కమ్యూనికేట్ అవుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు కానీ గ్యాప్ వస్తే మాత్రం మళ్లీ కలవలేరని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
లాభాలు:
* స్పేస్ టు థింక్ : విరామం తీసుకోవడం వల్ల వ్యక్తికి వారి సంబంధాన్ని ప్రతిబింబించడానికి, ఆ బంధం సరైనదో కాదో నిర్ణయించుకోవడానికి అవసరమైన ఆలోచనను అందిస్తుంది.
* వ్యక్తిగత వృద్ధి: రిలేషన్ నుంచి బ్రేక్ తీసుకోవడం వ్యక్తిగత పెరుగుదల, అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి అవకాశంగా ఉంటుంది.
* తగ్గిన ఒత్తిడి: ఒక సంబంధం ఒత్తిడికి లేదా ఉద్రిక్తతకు కారణమైతే.. విరామం తీసుకోవడం వల్ల అలాంటి భావాలను తగ్గించవచ్చు. రీఛార్జ్ కావచ్చు.
* మిసింగ్ ఈచ్ అదర్: ఇద్దరు పార్ట్‌నర్స్ ఒకరినొకరు ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసుకునేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఎదుటివారి గొప్పతనం, త్యాగాలు, విలువను గుర్తించడంలో సహాయపడుతుంది.
నష్టాలు:
* అపార్థాలు: విరామం తీసుకోవడం వల్ల రిలేషన్‌షిప్‌లో అపార్థాలు, గందరగోళం ఏర్పడవచ్చు.
* అసూయ: ఈ బ్రేక్ కారణంగా భాగస్వామి ఇతరులతో డేటింగ్ ప్రారంభించినట్లయితే.. అసూయ, పగను కలిగిస్తుంది.
* కమ్యూనికేషన్ బ్రేక్‌డౌన్: విరామ సమయంలో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదంటే.. బంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
* దగ్గరగా లేకపోవడం: విరామం తీసుకోవడం వలన క్లోజ్‌నెస్ తగ్గిపోవచ్చు. ఒకరి గురించి మరొకరు లైట్ తీసుకునేందుకు, దూరమయ్యేందుకు కారణం కావచ్చు.
Read more: