- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Over Confidence: ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిదా..చెడ్డదా..? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు..!
దిశ, ఫీచర్స్: మీ శక్తిని తెలుసుకుని ఒక పనిని కచ్చితంగా చేయగలను అనుకుంటే అది కాన్ఫిడెన్స్. మీకు ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని ఊహించుకుని ఏ పనినైనా చేయగలను అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీలవుతుంటారు. మరి కొందరు కాన్ఫిడెన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రవర్తిస్తుంటారు. కాగా ఇలాంటి ప్రవర్తన, వ్యక్తిత్వం ఏర్పడటానికి పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల గారాబం వంటివి కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
అతిగా ఊహించుకోవడం:
వాస్తవానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తమకు ఉన్న శక్తి, సామర్థ్యాలను అతిగా ఊహించుకునే ఒక విధమైన మానసిక స్థితిగా నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ఏ పనినైనా ఈజీగా చేయగలం, మాకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మాకు అన్నీ తెలుసు’’ అన్నట్లు వ్యవహరించడం అతి విశ్వాసం గల వ్యక్తుల్లో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటి. అయితే సాధారణంగా ఏదో ఒక విషయంలో ప్రతీ ఒక్కరిలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుదని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇది మనసు చేసే ఒక మ్యాజిక్. కాబట్టి మితిమీరిన విశ్వాసం ఉన్న వ్యక్తులు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను అంత ఈజీగా నమ్మరు.
కాన్ఫిడెన్స్‌లో రకాలు:
అతి విశ్వాసం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. కాలం గడిచేకొద్దీ దాని స్థాయిలో అనేక మార్పులు వస్తుంటాయి. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత గర్వంతో విర్ర వీగేవారు మొదటి రకమైతే.. ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటూ.. పరిస్థితులను అంచనా వేసుకుని అర్థం చేసుకుంటూ ముందుకు సాగేవారు రెండవ రకం. ఇక చివరి వ్యక్తులు సాధిస్తామని కొంత వరకు ప్రయత్నించి, సమస్యలు రాగానే లక్ష్యాన్ని వదిలేసేవారు. అయితే మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాగా ఎవరిలో ఉన్నప్పటికీ మితిమీరిన ఆత్మవిశ్వాసం తప్పుడు స్వీయ భరోసాతో ముడిపడి ఉంటుంది.
ఎలా అధికమించాలి:
ఓవర్‌కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తుల విషయానికి వస్తే.. సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించకుండానే ఏదైనా సాధిస్తామనే నమ్మకంతో ఉంటారు. కాబట్టి దీనిని వదులుకొని వాస్తవాల ఆధారంగా కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడం ఉత్తమమని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌ను వదిలి కాన్ఫిడెన్స్‌గా ఉండడం వల్ల సాధించే విజయమే సరైనదిగా, స్థిరమైనదిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేని శక్తిని ఉన్నట్లు ఊహించుకోకుండా.. నైపుణ్యానికి తగినట్లుగా వ్యవహరించకపోతే సమస్యలు వస్తాయి. ఆత్మవిశ్వాసం అనేది వ్యక్తిని ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. అతి విశ్వాసం వ్యక్తిని విజయంవైపు తీసుకెళ్లినా చివరికి వైఫల్యానికి దారితీస్తుంది.
Read More...
పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా..? పేరెంట్స్ ఇది తెలుసుకోండి..!