- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమలో ప్రశ్నించడం మంచిదేనా..?
దిశ, ఫీచర్స్: ప్రేమ అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, షేరింగ్ ఉంటుంది. కానీ, ఈరోజుల్లో చాలామంది ప్రేమ ఎలా ఉందంటే.. నాలుగు రోజులు ప్రేమించుకుని ఏవో చిన్న మనస్పర్ధలు రాగానే విడిపోతున్నారు. లేదంటే ఇరువురిలో ఏవరైనా ప్రశ్నిస్తుంటే అనుమానం అని వదిలేస్తున్నారు. ప్రేమలో నిజాయితీ మాత్రమే కాదు ఒకరిపై ఒకరికి నమ్మకం, మంచి అభిప్రాయం కూడా ఉండాలి. ప్రేమకు కావాల్సింది వ్యక్తిత్వం, అర్థం చేసుకునే మనసు. ప్రేమించి వ్యక్తి ప్రశ్నిస్తున్నాడనే చిన్న విషయానికి చాలామంది విడిపోతుంటారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. ప్రేమ బంధం శాశ్వతంగా నిలవాలంటే అందులో ప్రశ్నలు కూడా ఉండాలంటున్నారు నిపుణులు.
దీని వల్ల ఒకరి మనసు మరొకరికి బాగా తెలుస్తుంది. ప్రేమించిన వ్యక్తిని వెంటనే అంచనా వేయలేకపోవచ్చు. కానీ, ప్రశ్నించిన తరువాత ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామికి మీలో మార్చుకోవాల్సినవి ఏవైనా ఉంటే వారిని అడిగి తెలుసుకోవాలి. కేరీన్‌ని మార్చుకోవాలని ఇరువురిలో ఎవరైనా అనుకున్నా సరే దానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలి. ఇద్దరి మధ్య బంధం స్టాంగ్‌గా ఉండాలంటే కొన్ని విషయాల్లో ప్రశ్నించిండం తప్పేంకాదు. దాన్ని అనుమానం అని ఎప్పుడూ అనుకోకూడదు.
భాగస్వామిని ప్రశ్నిస్తుంటే అది వారిపై శ్రద్ధ చూపిస్తున్నారని అర్థం. అలా అని ప్రతీ చిన్ని విషయానికి ప్రశ్నిస్తే అది వివాదాలకు కారణం అవుతుంది. భాగస్వామిపై ఉండే నమ్మకం, ప్రేమకు బలాన్ని ఇస్తుంది. ఒకరికి నచ్చినట్లు మరొకరు నడుచుకోగలిగితే ఆ ప్రేమ సంతోషంగా ఉంటుంది. ప్రేమ ప్రయాణంలో కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరికి కొన్ని కండీషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. వాటిని గౌరవించి, పాటించాలి. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మీపై భరోసా, నమ్మకం కలుగుతుంది. ఇది ప్రేమకు మరింత బలాన్ని చేకూర్చుతుంది.