Sabja Seeds : నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తింటే ఫలితం ఉంటుందా?

by Prasanna |   ( Updated:2023-08-07 07:24:42.0  )
Sabja Seeds : నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తింటే ఫలితం ఉంటుందా?
X

దిశ, వెబ్ డెస్క్: సబ్జా గింజలను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలలో వాడుతుంటారు. వీటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

సబ్జా గింజలను తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం, జీవక్రియ అసమతుల్యత పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకున్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా మంచి ఆహారం. అంతే కాకుండా.. సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తాయి. గ్యాస్ సమస్యలు ఉన్న వారు వీటిని తాగుతుండటం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. నీటిలో నానబెట్టిన విత్తనాలను తినడం వల్ల కడుపు ప్రశాంతంగానూ, కడుపులో మంటసమస్యలు తగ్గుతాయి.

Advertisement

Next Story

Most Viewed