- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలికాలంలో హెల్తీగా ఉండాలా..? ఈ పండ్లు తింటే బెటర్
దిశ, ఫీచర్స్: ఏ సీజన్‌లో వచ్చిన పండ్లను ఆ సీజన్‌లో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చలికాలంలో కొన్ని రకాల పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని పిల్లలకు తినిపించడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ప్రతీ సీజన్‌లో వచ్చే పండ్లను పిల్లలకు తినిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎలాంటి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.
నారింజ: చలికాలంలో నారింజ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. నారింజలో ఉండే ఐరన్ రక్తహీనత నుంచి కాపాడుతుంది. మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని తినడం మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని క్యాల్షియంను ఎముకల్లో స్థిరపడేలా చేస్తుంది.
దానిమ్మ: శీతాకాలంలో పిల్లలకు దానిమ్మ పండు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఇ, కె, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, వైరస్ బారి నుండి పోరాడడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని పలుచగా చేసి, రక్త లోపాన్ని తగ్గిస్తుంది.
జామ: ఇందులో విటమిన్ సి, ఎ, ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు నుండి శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
నల్ల ద్రాక్ష: ద్రాక్షలో ఉండే పోషకాలు పిల్లల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, చర్మం, జుట్టు సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది.
బత్తాయి: ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఇన్ఫెక్షన్లును తగ్గిస్తాయి. అయితే, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు ఉన్న వారు మాత్ర దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
Read More...
కొత్తిమీర త్వరగా పాడైపోతుందా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!