- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WGL: సీఎం రేవంత్ సభకు ఆబ్సెంట్.. హాట్‌టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) నేత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy) తీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మధవరెడ్డి గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హన్మకొండ పట్టణంలో మాధవ రెడ్డి ఇంటి సమీపంలోనే బహిరంగ సభ జరుగుతున్నా ఆయన పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. ఇప్పుడే కాదు.. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్(Warangal) పర్యటనలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) జిల్లాకు వచ్చినా కలవలేదు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ్టి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొనడం విశేషం.