సమ్మర్‌లో పైనాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

by Jakkula Samataha |
సమ్మర్‌లో పైనాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
X

దిశ, ఫీచర్స్ : పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక సమ్మర్ వస్తే చాలు పైనాపిల్ జ్యూస్ తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే పైనాపిల్ కాస్త వగరుగా, తియ్యగా, పుల్లగా ఉండటం వలన కొంత మంది దీన్ని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. కానీ సమ్మర్‌లో పైనాపిల్ తినడం లేదా జ్యూస్ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువలన సమ్మర్‌లో ప్రతీ రోజూ దీన్ని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెంచుకోవచ్చు. అలాగే పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు దీన్ని తినడం వలన ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు.

ఇక వేసవిలో చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురి అవుతుంటారు. దీంతో వారు ఎక్కువగా నిమ్మరసం లాంటిది తాగుతారు బాడీ హైడ్రేట్‌గా ఉండటానికి. కానీ డీ హైడ్రేషన్ సమస్య ఉన్నవారు,రోజూ పైనాపిల్ తినడం లేదా జ్యూస్ తాగడం వలన ఈ సమస్య నుంచి బయటపడవచ్చునంట. పైనాపిల్‌ని సమ్మర్‌లో అతిగా తినడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉంటుందంట.

Advertisement

Next Story