- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్క్ చేసిన కారులో మద్యం తాగితే జైలు శిక్ష పడుతుందా?
దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్ రాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి మద్యం సేవించి.. ఫుల్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే కొంతమంది ప్రైవేటు ప్లేస్‌లో పార్టీలు చేసుకుని సైలెంట్‌గా ఇంటికెళ్తారు. మరికొందరు పబ్లిక్ ప్లేస్‌లో తాగి తందనాలాడి.. చివరకు కటకటాల పాలవుతారు. ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో ఎన్నో చూసే ఉంటారు. అయితే కొంతమంది వారి ప్రైవేట్ స్థలంలో మందు తాగితే, ఎలాంటి కేసు నమోదవ్వదనే అపోహలో ఉంటారు. తాజాగా మద్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సీనియర్ న్యాయవాది వినయ్ వత్ వెల్లడించారు. కానీ బహిరంగ ప్రదేశంలో మందు తాగడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
పబ్లిక్ ప్లేస్‌లో ప్రజలు తరచూగా వస్తుంటారు.. పోతుంటారు. పార్కులు, మాల్స్, రెస్టారెంట్లు ఇలా అన్నీ పబ్లిక్ స్థలాలే. ఒక కారు రోడ్డు పక్కన పార్క్ చేసినా రోడ్డుపై నడుస్తున్నట్లే. అది పబ్లిక్ ప్లేస్ విభాగంలోకి వస్తుంది. అదే కారు మీ ఇంటి గ్యారేజీలో పార్క్ చేస్తే అది ప్రైవేట్ స్థలంగా పరిగణించబడుతుంది. కాగా.. పార్క్ చేసిన కారులో మద్యం సేవించడం నేరమా? లేదా? అనేది మీ కారు ఎక్కడ పార్క్ చేయబడిందో దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ కారు గ్యారేజ్ వంటి ప్రైవేట్ ప్లేస్‌లో, మీ ఇంటి పక్కన ఉంటే, మీరు కారులో కూర్చొని మద్యం తాగొచ్చు. కానీ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లేదా మరేదైనా పబ్లిక్ ప్రాపర్టీలో కారును పార్క్ చేస్తే, అందులో మద్యం సేవించడం చట్టవిరుద్ధం అవుతుంది. తప్పకుండా జైలు శిక్ష పడుతుంది. అని సీనియర్ న్యాయవాది వినయ్‌వత్ వెల్లడించారు.