Irritating trends : ఆధునిక కాలంలో చికాకు కలిగించే పోకడలు.. ఇవి లేకుండా జీవించలేమా?

by Javid Pasha |
Irritating trends : ఆధునిక కాలంలో చికాకు కలిగించే పోకడలు.. ఇవి లేకుండా జీవించలేమా?
X

దిశ, ఫీచర్స్: కొన్నిసార్లు ఈ ప్రపంచమంతా తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మన జీవితాలు మరింత కన్వినియెంట్‌గా, ఆన్‌లైన్‌గా మారడంతో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇండివిడ్యువలిజం రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని దశాబ్దల కిందటితో పోలిస్తే సామాజికంగా, అభివృద్ధి పరంగా చాలా బెటర్‌గా ఉన్నాం. అదే సందర్భంలో ఇరిటేషన్ కలిగించే సామాజిక అంశాలు కూడా మోడర్న్ సొసైటీలో ఉన్నాయి. నిజానికి అవి లేకుండా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించవచ్చు అనిపిస్తుంది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

గౌరవ.. మర్యాదల్లో మార్పు

ఆధునిక కాలంలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఒకప్పటిలా మనుషుల మధ్య గౌరవ మర్యాదలు లేకుండా పోయాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సందర్భంలో అవసరమైన చోట కఠినంగా ఉండలేని పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మర్యాదలు పక్కదారి పట్టాయని, టూ మచ్ సోషల్ ఐసోలేషన్ ప్రజలు బహిరంగంగా, సామాజికంగా ఎలా జీవించాలో మర్చిపోయేలా చేసింది. కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రజలపట్ల అగౌరవంగా వ్యవహరించడం నేడు కామన్ అయిపోయింది. ఎవరైనా బేసిక్ మ్యానర్స్ కలిగి ఉంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు.

నేను నా మెంటాలిటీ..!

ఇప్పుడంతా ఇండివిజువాలిటీ హవా నడుస్తోంది. ఇతరులతో, సమాజంతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తిగతంగా ఆలోచించే ధోరణి ఆధునిక సమాజంలో పెరిగిపోయింది. బహుశా సోషల్ మీడియా బిగ్గెస్ట్ రిజల్ట్స్‌లో ఇది ఒకటని నిపుణులు అంటున్నారు. వ్యక్తివాదం చాలా బలంగా మారుతోంది. జీవితంలోని అనేక సందర్భాల్లో ఇది వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అహంకారాలు, అసూయలు, ఆధిపత్యాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. కారణాలేమైనా సొసైటీలో ఇప్పుడిది బిగ్గెస్ట్ ట్రెండ్.

డిస్పాజిబుల్ కల్చర్

ఇండివిజువాలిటీ క్రమంగా అధిక వినియోగానికి, మార్కెట్ కల్చర్‌కు, వస్తు వ్యామోహానికి కూడా దారితీసింది. నేటి ఆధునిక సమాజంలో మనం అవసరం ఉన్నా లేకున్నా కొన్నింటిని అధికంగా కొనుగోలు చేయడం, వినియోగించడం చేసేస్తున్నాం. ఇలాంటి మార్పులతో పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదు. నేటి డిస్ పాజిబుల్‌ కల్చర్‌‌లో మరో ఆలోచనకు అవకాశం లేకుండా అధిక వినియోగానికి మొగ్గు చూపుతున్నాం. అది ఎక్కువకాలం ఉండవని తెలిసినా వస్తువులను కొనుగోలు చేసి పర్యావరణానికి హాని చేస్తున్నాం.

సంబంధాలను ఈజీగా వదులుకోవడం

మోడర్న్ సొసైటీలో డిస్పాజిబుల్ కల్చర్ కేవలం వస్తువులకే పరిమితం కాలేదు. అది మానవ సంబంధాల్లోనూ కనిపిస్తోంది. ఒకప్పటితో పోల్చితే చిన్న చిన్న విషయాలకే పార్ట్‌నర్స్ విడిపోవడం, విడాకులు తీసుకోవడం, ప్రేమికుల్లో బ్రేకప్‌లు కామన్ అయిపోయాయి. అంతే వేగంగా డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా వేదికల ద్వారా మరొకరితో కనెక్ట్ అవడం, సంబంధాలు కలుపుకోవడం కూడా ఈజీ అయిపోయింది. ‘పర్‌ఫెక్ట్ ఫిట్’ కోసం చూస్తున్న వారికి ఆధునిక కాలంలో సంబంధాల ఎంపిక కష్టమే. ఎందుకంటే అది శాశ్వత సంబంధాల శత్రవుగా మారిపోయింది.

ఫ్యామిలీ వ్లాగర్స్

ఒకప్పుడు వ్యక్తిగత విషయాలు, విలువలు గురించి ఎక్కువగా ఆలోచించిన వారు. ఆచరించిన వారు ఆధునిక కాలంలో మారిపోతున్నారు. సోషల్ మీడియా వినియోగంతో మళ్లీ తమ ప్రైవసీని నార్మలైజ్ చేసేస్తున్నారు. అదే సందర్భంలో ఫ్యామిలీ బ్లాగర్స్ మరో లెవల్‌లో దూసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే వారు తమ పిల్లలు అభ్యంతరం చెప్పేంత వయస్సులో లేనప్పటి నుంచే వారి జీవితాలను సోషల్ మీడియా వేదికల్లో ప్రదర్శిస్తూ డబ్బులు అర్జిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాము ఫేమస్ కావడం కోసం చాలా మంది చిన్న పిల్లల రీల్స్, యాక్టివిటీస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు దుర్వినియోగం, దోపిడీలను ఇప్పుడు సోషల్ మీడియా నార్మలైజ్ చేసేసింది.

లోపిస్తున్న నిజాయితీ

నిజం చెప్పాలంటే నేటి ఆధునిక సమాజంలో మూర్ఖత్వం కూడా చాలా స్పష్టంగా బ్రెయిన్ వాష్ చేస్తోంది. మోడర్న్ ట్రెండ్స్ ద్వారా అది సరికొత్త లెవల్‌కు గ్లామరైజ్ చేయబడింది. ఒకప్పుడు తెలివి తేటలు, విలువలు, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకే ఆయా రంగాల్లో ప్రయారిటీ, అవకాశాలు ఉండేవి. ఇప్పుడు బిజినెస్ మొదలు పాలిటిక్స్ వరకు, ఇంకా అనేక రంగాల్లోనూ మూర్ఖుత్వం ఉన్నవారు.. అంటే నీతి, నిజాయితీ లేనివారు కూడా ఉంటున్నారని నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ మౌత్ పీస్ అయిన కారణంగా కొందరు మూర్ఖులు దానిని దుర్వినియోగ పరుస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా అది ప్రదర్శించబడుతోంది.

తాత్కాలిక ఆనందం

ఆధునిక సమాజంలో వాస్తవ ఆనందాలకంటే తాత్కాలిక లేదా తక్షణ సంతోషాలు, సంతృప్తులకే అధిక ప్రయారిటీ కనిపిస్తోంది. తక్షణ సంతృప్తి కోసం మన కార్డ్ వివరాలను పొందడం, బట్టలు ఆర్డర్ చేయడం లేదా కొనుగోలు చేయడం, అవసరమా లేదా అనేది ఆలోచించకుండా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇవన్నీ ఆధునిక సమాజంలో కనిపిస్తున్న ఇన్‌స్టంట్ సంతృప్తులు. కేవలం ‘ఫీల్ బెటర్’ పొందడం తప్ప ఉపయోగం లేదు.

సోషల్ మీడియాపైనే ఆధారపడటం

ఆధునిక సమాజంలో బిగ్గెస్ట్ మార్పుల్లో సోషల్ మీడియా ఒకటి. అయితే కొందరిలో ఇదొక వ్యసనంగానూ మారుతోంది. ప్రతి దానికీ సోషల్ మీడియా ధృవీకరణపై ఆధారపడుతుంటారు. కొందరైతే తాము ఎలాంటి డ్రెస్ కొనుక్కోవాలో, తమకు ఏది బాగుందో, ఏ మేకప్ నప్పుతుందో ఇలా అనేక విషయాలను ఆయా సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసిన వచ్చిన కామెంట్లు, వ్యూస్‌ను బట్టి అనుసరిస్తుంటారు. దీనివల్ల సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలకు తావులేకుండా పోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా అవసరమే కానీ.. అది వ్యక్తిగత వృద్ధికి, విజ్ఞానానికి, విజ్ఞతకు నష్టం కలిగించే స్థాయిలో దుర్వినియోగ పర్చడంవల్ల నష్టం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed