IRCTC టూర్ ప్యాకేజీ : IRCTC బంపర్ ఆఫర్.. తక్కువ ధరలో మంచి టూర్ ప్యాకేజ్..

by Sumithra |
IRCTC టూర్ ప్యాకేజీ : IRCTC బంపర్ ఆఫర్.. తక్కువ ధరలో మంచి టూర్ ప్యాకేజ్..
X

దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చేసింది. పిల్లల పరీక్షలు కూడా ఏప్రిల్ మాసంలో ముగియనున్నాయి. దీంతో చాలా కుటుంబాలు టూర్ లు వేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం బడ్జెట్ ప్రాబ్లంతో దగ్గర ప్రాంతాలకు టూర్ లకు వెళుతుంటారు. ఏప్రిల్ సీజన్‌లో వేడి ఎక్కువగా ఉండదు అందుకే చాలామంది హాయిగా షికారు చేయడానికి బయటికి వెళుతుంటారు. అయితే మీరు కూడా వచ్చే నెలలో ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నట్లయితే IRCTC ఓ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. IRCTC ఈ ప్యాకేజీ పేరు మధ్యప్రదేశ్ దర్శన్ అని పేరు పెట్టింది.

మధ్యప్రదేశ్ లోని అందమైన ప్రదేశాలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల సాహస దృష్యాలను కూడా చూడవచ్చు. అందుకే ఈసారి పిల్లల పరీక్ష తర్వాత, మీరు మీ పిల్లలతో మధ్యప్రదేశ్ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మరి IRCTC అందిస్తున్న మంచి ప్యాకేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC మధ్యప్రదేశ్ దర్శన్ ప్యాకేజీ..

IRCTC అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ వ్యవధి 4 రాత్రులు, 5 పగళ్లు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విమాన ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. ఈ టూర్ ప్యాకేజీలో మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి విమానాల్లో ప్రాయణించి పుణ్యక్షేత్రాలను చేరుకోవచ్చు.

అందుబాటులో ఉన్న సౌకర్యాలు..

IRCTC మధ్యప్రదేశ్ దర్శన్ ప్యాకేజీలో, పర్యాటకులు ఎకానమీ క్లాస్ విమాన టిక్కెట్లను పొందవచ్చు. ఇందులో రౌండ్ ట్రిప్ ప్రయాణం కూడా ఉంటుంది. అంతే కాకుండా స్టే చేసేందుకు హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో మీకు రాత్రి భోజనం, అల్పాహారం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందవచ్చు.

ఈ IRCTC ట్రిప్‌లో మీరు ఒంటరిగా వెళ్లాలనుకుంటే దాదాపు రూ. 33,350 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఇద్దరు వ్యక్తులు వెళితే ఒక్కొక్కరికి రూ.26,700 చెల్లించాల్సి ఉంటుంది. అదే ముగ్గురు ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.25,650 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీరు మీతో పాటు పిల్లలను తీసుకెళ్తుంటే ఒక్క కాట్ కు విడిగా చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కాట్ తో పాటు రూ. 23,550, కాట్ లేకుండా రూ. 21,450 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ బుకింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుందని IRCTC తెలిపింది.

Advertisement

Next Story