అంతర్జాతీయ బాలికా దినోత్సవం

by samatah |   ( Updated:2022-10-11 10:26:38.0  )
అంతర్జాతీయ బాలికా దినోత్సవం
X

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి ఏటా అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అనర్థాలను నివారించి వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త 'ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌' 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా 'మ్యాన్‌' అనే పదాన్ని పీపుల్‌గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం ఎనలేని పోరాటం చేసిన ఆమె పుట్టిన రోజునే(అక్టోబరు 11) అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012 అక్టోబరు 11న తొలిసారిగా ఈ ప్రత్యేక రోజును నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతల(విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. బాలికలు, యువతులు తదితర రంగాల్లో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ దినోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా #dayofthegirl అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తుంది.

Also Read: గాసిప్‌లో నిజముంటే మేలు జరుగుతుందా?

Advertisement

Next Story