ఉపవాసంతో గుండె ఆరోగ్యానికి మేలు

by Mahesh |   ( Updated:2023-03-14 07:19:23.0  )
ఉపవాసంతో గుండె ఆరోగ్యానికి మేలు
X

దిశ, ఫీచర్స్: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అప్పుడప్పుడు ఉండే ఉపవాసం) గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అంటే.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవించే అనారోగ్య కరకమైన మరణాలకు మొదటి కారణం గుండె జబ్బులే. శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగానే ఇలా జరుగుతుండగా.. ఫాస్టింగ్ అనేది ఫ్యాట్‌ తగ్గించడంలో సహాయపడుతూ ప్రమాదాన్ని నివారిస్తుంది. నచ్చిన టైం లో అనుసరించే ఈ ఉపవాసం వల్ల కేవలం గుండె ఆరోగ్యమే కాకుండా ఇతర అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

సమయానికి తిన్నా, తినకపోయినా.. వ్యాయామం చేసినా, చేయకపోయినా.. ఈ రోజుల్లో గుండె జబ్బు మరణాలు పెరుగుతున్నాయి. అందుకే తీసుకునే ఆహారం మూలంగా కొలెస్ర్టాల్ పేరుకుపోయి గుండెకు ప్రమాదం చేకూరకుండా ఉండేందుకు అడపా దడపా ఉపవాసం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్‌కు మన శరీరం స్పందించే విధానం మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

కొలెస్ట్రాల్‌, అధిక బరువు, డయాబెటిస్ ప్రమాదాన్ని అరికడుతుంది. ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం సమయ పరిమితితో కూడిన ఆహారం. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం ఒక పద్ధతి అయితే, ఉదయం 11 రాత్రి 8 గంటల వరకు మరో పద్ధతి. అలాగే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒకసారి తింటూ ఉపవాసం ఉండటం కూడా చేయవచ్చు. మొత్తానికి 12 గంటల ఉపవాసం’ అని గుర్తుంచుకోవాలి.

ప్రయోజనాలు

* గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

* గుండెపోటు, స్ట్రోక్స్, లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధుల ప్రభావం ఉండదు.

* హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించి, డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాలను నివారిస్తుంది.

* అధిక మాంసకృత్తులు, కొవ్వులు, ఫైబర్స్ వంటివి శరీరంలో సమతుల్యంగా ఉంటాయి.

* ఉపవాసంలో పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.

* గర్భిణులు, బాలింతలు, తక్కువ బరువు ఉన్నవారు, డయాబెటిస్ బాధితులు ప్రయత్నించొద్దు.

Advertisement

Next Story

Most Viewed