- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంతానలేమి సమస్యలు.. అండోత్పత్తిని ప్రేరేపించేందుకు ఐవీఎఫ్
దిశ, ఫీచర్స్: మారిన లైఫ్ స్టైల్‌తో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మెంటల్ స్ట్రెస్, జంక్ ఫుడ్, ఒబేసిటీ, నిద్ర లేమి, ఆల్కహాల్, స్మోకింగ్, పొల్యూషన్ వంటి ఎన్నో కారణాలతో కపుల్స్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాళ్లలోనే సమస్య ఉందని భావించేవాళ్లు. వారికే ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్లు. అందుకే ఎక్కడ చూసినా ఫీమేల్ ఫెర్టిలిటీ సెంటర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఒపీనియన్ మారింది. సంతాన సమస్యలకు మగవాళ్లలోని లోపాలు కూడా కారణమనే అవగాహన పెరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్తున్నారు. అయితే గైనకాలజిస్టులతో అన్ని విషయాలు చెప్పుకునేందుకు చాలా మంది మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ‘మేల్ ఫెర్టిలిటీ సెంటర్స్’ స్టార్ట్ అయ్యాయి. ఆండ్రాలజిస్టులు, ఇతర డాక్టర్ల టీమ్ పురుషులకు ట్రీట్మెంట్ ఇస్తోంది.
ఫెర్టిలిటీ సమస్యలో భావోద్వేగాలు ఇమిడి ఉండటం వల్ల సున్నితమైన అంశం అయింది. ఈ సమస్య వెనుక అనేక రకాల అనారోగ్య కారణాలు ఉండొచ్చనే విషయాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. డయాగ్నస్టిక్స్‌లో అభివృద్ధి రావడం వల్ల కచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుంది. ఇందుకు పరిష్కారం లభిస్తుంది. స్థూలకాయం లేనట్లయితే పెరిగిన సాంకేతికత మంచి ఫలితాలను అందిస్తోంది. ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ (ఇక్సీ) ఈ కోవలోకే వస్తాయి.
ఐయుఐ - ఇంట్రాయుటెరిన్ ఇన్సెమినేషన్
సంతానలేమి సమస్యకు మొదటి దశ చికిత్స ఇది. అయితే ఇందుకోసం స్త్రీలలో సమస్య లేకుండా తప్పనిసరిగా పెరుగుతున్న ముప్పు. ఇంతకుముందు పెళ్లిళ్లు త్వరగా అయ్యేవి. ఇప్పుడు అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఒకవేళ పెళ్లి అయినా పిల్లల్ని ఆలస్యంగా కంటున్నారు. కొన్నిసార్లు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకోకపోయినా.. ఉద్యోగకారణాల వల్ల కూడా లేట్ అయ్యే సందర్భాలున్నాయి. ఈలోపు వయసు పెరుగుతున్నది. సంతానలేమికి ఇదీ ఒక కారణమే. కంప్యూటర్ల వాడకం. రేడియేషన్ ఎక్కువ కావడం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ. కాగా విపరీతమైన ఒత్తిడి వల్ల హార్మోన్ల సమస్యలు వస్తున్నాయి. మానసిక ఒత్తిడి హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపిస్తుంది. స్థూలకాయం ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. స్థూలకాయం వల్ల పీసీఓడీ లాంటి హార్మోన్ సంబంధిత సమస్యలు ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్ కూడా ఇందుకు కారణమవుతుండగా.. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా సమస్య ఉంటుంది.
చికిత్స పద్ధతులు..
స్థూలకాయం వల్ల సమస్య ఉన్నప్పుడు బరువు తగ్గితే చాలా ఉండాలి. కనీసం ఒకట్రెండు అండాలు చాలు. ఈ అండంలోకి వీర్యాన్ని ఇంజెక్ట్ చేస్తారు. కారణం తెలియకుండా ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు, అండోత్పత్తి సరిగా లేనప్పుడు ఐయుఐ చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా అండోత్పత్తిని ప్రేరేపించడానికి మందులు ఇచ్చి, తరువాత ఐయుఐ చేస్తారు.
ఐవీఎఫ్
అధిక మోతాదులో హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి అండోత్పత్తిని ప్రేరేపిస్తారు. తరువాత అండాలను సేకరించి, ప్రయోగశాలలో వీర్యకణాలతో కలుపుతారు. అలా శరీరం బయట కృత్రిమ వాతావరణంలో ఫలదీకరణం జరిగితే ఇన్విట్రో ఫర్టిలైజేషన్(ఐవిఎఫ్) అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భంలోకి ప్రవేశపెడతారు. అయితే ఐవిఎఫ్ ద్వారా ఫలదీకరణం చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీని ద్వారా చికిత్స చేసినప్పుడు మందుల వల్ల కొన్ని తాత్కాలికమైన సైడ్ ఎఫెక్టులుంటాయి. దీనివల్ల అండాశయం హైపర్ స్టిమ్యులేట్ కావొచ్చు. దీన్ని హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటారు. అండాశయ పరిమాణం పెరుగుతుంది. కొంచెం నొప్పి, వికారం ఉండవచ్చు. శరీరంలో ద్రవం పేరుకోవచ్చు. ఒకట్రెండు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. తరువాత నార్మల్ అవుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రెస్ట్ అవసరం లేదు. దీని వల్ల బలహీనపడతారన్నది అపోహే. నొప్పి కూడా ఉండదు. అనెస్తీషియా ఇస్తారు. అండాలను సేకరించిన రెండు గంటల్లోగా ఇంటికి వెళ్లిపోవచ్చు.
ఇక్సీ
ఐవిఎఫ్ కన్నా లేటెస్ట్ విధానం ఐసీఎస్ఐ(ఇక్సీ). 90 శాతం వరకు చికిత్సలు ఇక్సీ ద్వారానే చేస్తారు. సాధారణంగా వీర్యకణాల సంఖ్య 15 మిలియన్ల కన్నా ఎక్కువ ఉండాలి. 10-15 మధ్యలో ఉంటే మైల్డ్, 5-10 మధ్య ఉంటే మోడరేట్, 5 కన్నా తక్కువ ఉంటే ఇస్ఫెర్టిలిటీ ఉన్నట్టే. 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇక్సీ చేస్తారు. ఈ విధానంలో కూడా ముందు హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి, అండాలను సేకరిస్తారు. రెండు అండాలకు వీర్యకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఫలదీకరణం చెందిన ఈ అండాలను ఇంక్యుబేటర్‌లో పెట్టి ప్రయోగశాలలో అభివృద్ధిపరుస్తారు. మూడు రోజుల తరువాత గర్భంలోకి ప్రవేశపెడతారు. నిజానికి ఇది పురుషుల్లో సమస్యలున్నప్పుడు చికిత్సగా రూపొందించారు. కాని ఎవరిలో సమస్య ఉన్నా ఈ పద్ధతి ఉత్తమమైనది. ఇక్సీ పద్ధతి ద్వారా సరైన వీర్యకణాన్ని ఎంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: కాలు మీద కాలేసుకుని కూర్చుంటే.. మగాళ్లలో పడిపోతున్న స్పెర్మ్ కౌంట్..