- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంళూరులో హార్ట్ సింబల్ ట్రాఫిక్ లైట్స్.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్ : బెంగళూరు రోడ్లపై కొన్ని ట్రాఫిక్ లైట్లు హార్ట్ షేప్‌లోకి మారడంతో చాలా మంది ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు సదరు ట్రాఫిక్ లైట్ల చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మరాయి. ఈ ఇనిషియేటివ్ పట్ల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్న నెటిజన్లు.. ఈ సిగ్నల్స్ షేప్ మార్చేందుకు గల కారణాలపై చర్చిస్తున్నారు. ఇంతకీ ఈ మార్పు వెనకున్న కారణమేంటి?
బృహత్ బెంగళూరు మహానగర పాలికే(BBMP), బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో మణిపాల్ హాస్పిటల్స్ ఈ హార్ట్ షేప్డ్ రెడ్ లైట్లను ఏర్పాటు చేసింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా నగరంలోని 15 సిగ్నల్స్‌ను ఈ విధంగా పునర్నిర్మించారు. ఇక ఈ ఉద్యమానికి గుర్తుగా.. హాస్పిటల్ చైన్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. '#WorldHeartDay సందర్భంగా, బెంగుళూరును 'హార్ట్ స్మార్ట్ సిటీ'గా ప్రోత్సహించేందుకు మణిపాల్ హాస్పిటల్స్ పలు ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. వీటిలో రెడ్ సిగ్నల్ గుండె ఆకారంలో ఉండటం, గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఆడియో సందేశాలు, అత్యవసర సేవల సులభతర యాక్సెస్ కోసం కాల్ చేయడానికి నంబర్ డయలింగ్‌కు బదులు క్యూఆర్ కోడ్స్ వంటివి ఉన్నాయి. సంబంధిత స్నాప్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి' అని పేర్కొంది.
ఇటీవల అమర్చిన ఈ లైట్లతో పాటు మణిపాల్ హాస్పిటల్స్ యాజమాన్యం ట్రాఫిక్ లైట్లకు దగ్గరగా క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేసింది. ఈ కోడ్స్‌ను స్కాన్ చేసినప్పుడు, బాధితున్ని తక్షణమే అంబులెన్స్ సేవకు కనెక్ట్ చేసి ఆ తర్వాత అత్యవసర నంబర్‌కు కనెక్ట్ చేస్తాయి. కాల్ చేయడం, మరెక్కడైనా వైద్యసహాయం కోసం వెతకడం అసాధ్యమైనపుడు అవసరమైన సమయాల్లో ఒక్క బటన్ నొక్కితే సాయమందించడమే ఈ సేవల కాన్సెప్ట్. కాగా 'ప్రతి ప్రాణం ముఖ్యమని సూచించేందుకే గుండె ఆకారంలో ట్రాఫిక్ సిగ్నల్ రూపొందించబడింది' అని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు.